మెగా కపుల్స్ పదేళ్ళ ప్రయాణం.. వీడియో వైరల్

Update: 2022-06-11 13:34 GMT
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బెస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో రామ్ చరణ్ తేజ్ ఉపాసన జోడి చాలా అందంగా ఉంటుంది అనే చెప్పాలి. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా కూడా కెమెరాలు అన్నీ కూడా వారి వైపు ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటాయి.

ఒకవైపు ప్రొఫెషనల్ మరొకవైపు ఫ్యామిలీ లైఫ్ లో చాలా అందంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న ఈ జంట ఒక విధంగా అందరికీ ప్రేరణగా నిలుస్తోంది అనే చెప్పాలి.

ఎంత బిజీగా ఉన్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చాలా సంతోషంగా వారి దాంపత్య జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఇక  వీరు 2012 జూన్ 14వ తేదీన పెళ్లి సిగేసుకున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో 10వ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. రామ్ చరణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండగా ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ ఛారిటీ వైస్ చైర్మన్ మరియు బి పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా కొనసాగుతున్నారు.

ఇక పదేళ్ల క్రితం వీరి పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక చరిత్రాత్మకమైన కోటలో  వీరి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఇక వీరి పెళ్లి రోజు సందర్భంగా అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పెళ్లి లో రామ్ చరణ్ తేజ్ ఉపాసన తో చాలా ఆనందంగా ఉండడం అలాగే ఆమె మెడలో తాళి కడుతున్న సందర్భం కూడా హైలెట్ గా నిలుస్తోంది.

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా మంచి గుర్తింపు అనుకుంటున్న రామ్ చరణ్ తేజ్ ఉపాసన ఇటీవల ప్రత్యేకంగా ఒక వెకేషన్ కు కూడా వెళ్లారు. ఇక ఈ పదవ యానివర్సరీ వేడుకను వారు కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొంటారట. అలాగే కొంతమంది సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Full View
Tags:    

Similar News