జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య సఖ్యత చూస్తుంటే అభిమానుల దిష్టి తగిలేలా ఉంది. రాజమౌళి సినిమా కోసం ఇద్దరు టై అప్ అయ్యాక అది ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. తారక్-ప్రణతిల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేవలం రెండు జంటలు మాత్రమే సెలెబ్రేట్ చేసుకున్న ఫోటో నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎంతో చనువుగా రామ్ చరణ్ మీద జూనియర్ ఎన్టీఆర్ చేయి వేసి నిలుచుని ఉండగా అభయ్ రామ్ ఉపాసన ఒడిలోఎంతో ఆప్యాయంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటో చూసేందుకు ఫాన్స్ కు రెండు కళ్ళు చాలలేదు. మరోపక్క లక్ష్మి ప్రణతి కళ్ళలో కూడా ఆనందం తాండవిస్తోంది. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. భరత్ అనే నేను విజయోత్సవంలో కూడా ఇద్దరు మహేష్ తో కలిసి ఎంజాయ్ చేసిన పిక్స్ ఇంకా కళ్ళ ముందు మెదులుతూ ఉండగానే ఇప్పుడు ఇది రావడం భలే కిక్ ఇస్తోంది.
నిజానికి చరణ్ తారక్ ల మధ్య ఫ్రెండ్ షిప్ ఈనాటిది కాదు. బాద్షా ఓపెనింగ్ కి రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా రావడం అది అయ్యాక ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్ళిపోవడం చూసి అప్పట్లోనే మెగా కొణిదెల ఫ్యామిలీస్ కి మంచి అండర్ స్టాండింగ్ ఉంది అనుకున్నారు. ఇప్పుడు దానికి మరింత బలం చేకూరుస్తూ ప్రతి అకేషన్ ను చరణ్ తారక్ జాయింట్ గా కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే రాను రాను ఈ ట్రెండ్ కొనసాగేలా కనిపిస్తోంది. అసలు ఈ ఫోటోలకే అభిమానులకు ఇలా అనిపిస్తే రేపు రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యాక అందులో వచ్చే స్టిల్స్ చూస్తే కాళ్ళు భూమి మీద నిలవడం కష్టమే. అంతలా ఇద్దరి మధ్య స్నేహం నడుస్తోంది. వివిధ కారణాల వల్ల చిరు-బాలయ్యల మధ్య స్నేహం ఉన్నా కలిసి సినిమా చేయలేకపోయారు. ఆ అడ్డు గోడలను బ్రేక్ చేసి ఇప్పుడు చరణ్-తారక్ ముందుకు రావడం చూస్తుంటే ఇంత కంటే నయనానందకరం ఏముంటుంది