ఒక మూవీ కోసం పూర్తి స్థాయి కమిట్మెంట్ చూపించి.. అద్భుతంగా మలిస్తే.. ఎంతటి ఖర్చు అయినా రాబట్టుకోవచ్చనే విషయాన్ని బాహుబలి నిరూపించింది. ఈ సినిమా కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామన్నది నిర్మాతల మాట. ఇంతకు మించిన ఖర్చు.. సమయంలో మహాభారతాన్ని తీయాలన్నది తన ఆలోచనగా రాజమౌళి గతంలోనే చెప్పాడు.
అయితే.. మలయాళంలో వెయ్యి కోట్లతో రాండమూఝం అంటూ వెయ్యి కోట్లతో మహాభారతాన్ని భీముడి కోణంలోంచి తీయబోతున్నట్లు మోహన్ లాల్ చెప్పడంతో.. జక్కన్న భారతం పక్కకు వెళ్లినట్లే. ఇలాంటి సమయంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 500 కోట్ల రూపాయల ఖర్చుతో రామాయణ మహా కావ్యాన్ని నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీన్ని బేస్ చేసుకుని.. రామ్ చరణ్ ను శ్రీరాముడిగా మార్చేసి డిజైన్ చేసిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసేస్తోంది.
మగధీరలో రామ్ చరణ్ ఫేస్ ను రాముడి గెటప్ లోకి మార్చేసి పోస్టర్ ను డిజైన్ చేశారు. 500 కోట్ల బడ్జెట్.. త్రీడీ మూవీ.. రామ్ చరణ్ యాజ్ రామ.. ఇన్నేసి నేమ్ కార్డ్స్ ను చూస్తే.. నిజంగానే యూనిట్ వర్గాలే పోస్టర్ ను రిలీజ్ చేశాయేమో అనిపించక మానదు. ప్రస్తుతానికి అల్లు అరవింద్ రామాయణం తీయడం ఎంతటి వాస్తవమో.. రాముడిగా రామ్ చరణ్ నటిస్తున్నాడనేది కూడా అంతే వాస్తవం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/