చరణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ యూత్ లోకి దూసుకెళ్లాయి. బ్రూస్లీ టైటిల్ వినగానే ఇదో భారీ యాక్షన్ సినిమా అన్న సంగతి ఇట్టే అర్థమైపోతోంది. అందుకు తగ్గట్టే చరణ్ బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తున్నాడు. పోస్టర్లు, టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అయితే బ్రూస్లీ రాక ఎప్పుడు? దసరా బరిలో వచ్చేస్తున్నట్టేనా? అన్న డిష్కసన్ ఫిలింనగర్ లో సాగుతోంది. ఇప్పటికే అక్టోబర్ 16 రిలీజ్ తేదీ అంటూ చెప్పినా.. అప్పటికి ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ సహా కీలకసన్నివేశాల చిత్రీకరణ ఇంకా సాగుతూనే ఉంది. కాబట్టి దసరా బరిలో ఈ సినిమా కష్టమేనని అంటున్నారు. ఒకవేళ దసరా బరిలో చరణ్ రాకపోతే అది ఎంతోమందికి ఖుషీనిచ్చే వార్త. ఓ పెద్ద కాంపిటీటర్ రేసులోంచి వెనక్కి వెళ్లినట్టే. దీనివల్ల ముందుగా లాభపడేది అఖిల్. అసలే నాగార్జున అఖిల్ ని సోలోగా లాంచ్ చేస్తేనే బెటర్ అనే ప్లాన్ లో ఉన్నాడు. అక్టోబర్ రిలీజ్ ని పరిశీలిస్తున్నారు కాబట్టి పోటీ లేకుండా చూసుకోవాలన్నది ప్లాన్.
అలాగే గుణశేఖర్ రుద్రమదేవి 3డికి కూడా పోటీ తప్పుతుంది. ఈ సినిమా భారీ కాన్వాసుతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కింది కాబట్టి కనీసం మూడు వారల గ్యాప్ వేరొక పెద్ద సినిమాతో తప్పనిసరి. ఒకవేళ చరణ్ వస్తే పెద్ద దెబ్బ పడుతుంది. ఆ రకంగా రుద్రమకి కలిసొచ్చినట్టే. అలాగే అనుష్క సైజ్ జీరో, రామ్ శివం, వరుణ్ తేజ్ కంచె చిత్రాలు అక్టోబర్ లోనే రిలీజ్ కి వస్తున్నాయి. కాబట్టి వీళ్లందరికీ ఊపిరి తీసుకునే అవకాశం చరణ్ ఇస్తున్నాడనే అనుకోవాలి.