బ్రూస్ లీ కి వేరే టైటిల్ పెడితే..

Update: 2015-10-24 17:30 GMT
రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన బ్రూస్ లీ.. ది ఫైటర్ దసరాకి థియేటర్ల లోకి వచ్చేశాడు. డివైడ్ ఉన్నా.. కలెక్షన్లు మాత్రం బాగానే కొల్లగొడుతోంది చెర్రీ మూవీ. మొదటివారంలో 35  కోట్ల షేర్ వసూళ్లయ్యాయంటే.. ఈ మూవీకి ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. అయితే.. ఈ సినిమాకి బ్రూస్ లీ దిఫైటర్ అని కాకుండా.. ఎలా ఉంటుంది?

ఇదే విషయం రామ్‌ చరణ్‌ ను అడిగితే.. ''బ్రూస్ లీ అక్క కోసం'' పెడితే బాగుండేదేమో అంటూ జోక్ చేశాడు ఓ ఇంటర్వ్యూ లో.  బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ అక్క రోల్ చేసిన క్రితి కర్బందాతో కలిసి.. దసరా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన చరణ్.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమాతో పాటు.. పర్సనల్ సంగతులనూ పంచుకున్నాడు. సినిమా కాబట్టి అక్క కోసం అన్ని త్యాగాలు చేశాను కానీ.. రియల్ లైఫ్ లో అయితే చరణ్ ఒక్క త్యాగం కూడా చేయలేదట. అంతే కాదు.. ఇంట్లో లైట్ స్విచాఫ్ చేయడానికి కూడా చెల్లెలిని పిలిచేవాడట.

అలాగే చెర్రీ అక్క కేరక్టర్ లో సెంటిమెంట్ పండించిన క్రితి కర్బందాకి కూడా.. ఇలాంటి త్యాగాలు చేసిన అన్నయ్యలు ఎవరూ లేరట. అయితే.. పండుగ ఇంట్లో ఎలా చేసుకుంటారని అడిగితే మాత్రం.. పండక్కి అమ్మేం చెబితే అంతే అంటున్నాడు చరణ్. సినిమాలో నాన్నతో తిట్లు తిన్నట్లు.. నిజ జీవితంలో మెగాస్టార్ తో ఎప్పుడూ తిట్టింటుకోలేదట. ఇంట్లో నాన్నది శంకర్ దాదా కేరక్టర్ అనీ, ఆనందం వచ్చినా కోపం వచ్చినా గట్టిగా కౌగిలించుకుంటారని అంటున్నాడు మెగా వారసుడు.
Tags:    

Similar News