రామ్‌చరణ్ మారిపోయాడు. ‘రంగస్థలం’ ట్రైలర్ చూసినవాళ్లెవరైనా ఈ మాట ఒప్పుకుంటారు. కానీ తెర మీదే కాదు, తెర వెనకా రామ్‌చరణ్‌లో మార్పు చాలా వచ్చిదంట. ఇంతకు ముందులా కాకుండా పూర్తి స్కిప్టును తన చేతిలో పెట్టిన తర్వాతే షూటింగ్ అంటూ కొత్త కొత్త కండీషన్లు పెడుతున్నాడట. దీంతో దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుకి ఎలా చెప్పాలో తెలియక.. మదన పడుతున్నారు.
సుకుమార్ తో కలిసి సంవత్సరం కష్టపడి ‘రంగస్థలం’ సినిమా చేశాడు రామ్ చరణ్. అయితే ఈ సినిమా చెర్రీ చాలా విషయాలు నేర్పింది. ముఖ్యంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా ఉగాదికి కూడా విడుదల కాలేకపోయింది. కారణం ఆన్ లోకేషన్ లో స్క్రీప్టు మారిపోతూ ఉండడమే నట. దాంతో 2017లో చెర్రీ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాలను అనుకున్న సమయానికే పూర్తి చేయాలనే పట్టుదల
చరణ్ లో పెరిగింది. దాంతో సినిమా మొదలుకాకముందే పూర్తి స్క్రిప్టును తనకు వినిపించాలని డిమాండ్ చేస్తున్నాడని టాక్. ‘రంగస్థలం’ తర్వాత ఆయన బోయపాటి శ్రీను సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 20న మొదలైంది కూడా. అయితే చరణ్ మాత్రం షూటింగ్ కి హాజరు కాలేదు. కారణం స్ర్కిప్టులో మార్పులు చేయమని బోయపాటికి చెప్పాడట చెర్రీ. మార్పులు చేసిన తర్వాత మరోసారి కథ మొత్తం వినిపించాలంటున్నాడట.
పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కి వెళ్లకపోతే మున్ముందు బోయపాటికి తలనొప్పి మరింత పెరిగే ఛాన్సుంది. ఇక షూటింగ్ కూడా ప్రారంభించిన తర్వాత ఇలా కథలో మార్పులు చేయమంటే ఎలా? అని వాపోతున్నాడు ఈ మాస్ డైరెక్టర్. చూద్దాం చివరకు చిట్టిబాబు ఏం చేస్తాడో!!