రామ్ చరణ్ తన తండ్రి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొంటున్నాడు. పదేళ్ల తర్వాత తన తండ్రి సినిమా వస్తున్నప్పటికీ - ఇండస్ట్రీలో కీలక మార్పులు చోటు చేసుకొన్నప్పటికీ చిరుకి ఉన్న ఇమేజ్ - మార్కెట్టు చెక్కు చెదరలేదన్న విషయాన్ని చాటి చెప్పేలా చరణ్ ప్లాన్ వేశాడు. ఆ ప్లానింగ్ ని అమలు చేయడం కోసమే రామ్ చరణ్ నిర్మాతగా మారినట్టు కూడా వార్తలొస్తున్నాయి. చిరంజీవి ఇదివరకు ఏ సినిమా చేసినా పారితోషికం తీసుకొనేవారు కాదు. తనకి మంచి ఫాలోయింగ్ - మార్కెట్టు ఉన్న నైజాం ఏరియా రైట్స్ ని తీసుకొనేవారు. దాంతోనే ఆయనకి అత్యధిక పారితోషికం అందుకొంటున్న కథానాయకుడిగా చలామణీ అయ్యేవారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కంటిన్యూ చేయాలనుకొంటున్నాడట చెర్రీ.
సొంత సినిమానే అయినప్పటికీ నైజాం ఏరియా రైట్స్ మాత్రం తన తండ్రి ఖాతాలోనే పడేలా చూసుకొంటున్నాడట. అందుకే ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు క్రేజీ ఆఫర్లతో ముందుకొస్తున్నప్పటికీ చెర్రీ మాత్రం రైట్స్ అమ్మడం లేదట. మిగతా ఏరియాల బిజినెస్ మాత్రం చేసేస్తున్నాడట. వేరే కొత్త నిర్మాత అయ్యుంటే యంగ్ హీరోల స్థాయిలో క్రేజ్ లేదు కదా అని చిరుకి పారితోషికమే ఇచ్చి సరిపెట్టేవాళ్లు. కానీ చెర్రీ మాత్రం తన తండ్రి అప్పటికీ ఇప్పటికే నెంబర్ వన్ అనిపించుకొనేలా సినిమా మార్కెట్ చేస్తున్నారు. చెర్రీ నైజాం రైట్స్ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి, తదుపరి నిర్మాతలు కూడా అదే తరహాలోనే నడుచుకొంటారని చిరు ఫ్యామిలీ భావిస్తోంది.