బాబాయ్ చెప్పింది శిరోధార్యం

Update: 2018-12-19 04:58 GMT
వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం ఈవెంట్ నిన్న సాయంత్రం మెగాభిమానుల్ని మైమ‌రిపించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఈ వేదిక‌పై అతిధి రామ్ చ‌ర‌ణ్ త‌మ్ముడు వ‌రుణ్ గురించి - బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి మాట్లాడిన మాట‌లు ప‌దే ప‌దే మెగాభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చాయి. ప‌వ‌న్ అందించిన ఓ సందేశం గురించి చ‌ర‌ణ్ ఎంతో గొప్ప‌గా చెప్పారు. అలాగే వ‌రుణ్ ఆలోచ‌నా శైలి గురించి ఎంతో సంభ్ర‌మంగా చెప్పుకొచ్చాడు. ఆ రెండు పాయింట్లు కేవ‌లం అభిమానుల‌కే కాదు, అంద‌రికీ ఆద‌ర్శం.. అనుచ‌ర‌ణీయం అనీ చ‌ర‌ణ్ బ్రిలియంట్ స్పీచ్ నే ఇచ్చాడు. అస‌లింత‌కీ చ‌ర‌ణ్ ప్ర‌త్యేకించి నొక్కి చెప్పిన ఆ మాట‌ల్ని మ‌రోసారి ప‌రిశీలిస్తే..

మొన్ననే బాబాయ్‌ (పవన్‌) చెప్పిన మాటలు నా గుండెల్లోకి దూసుకెళ్లిపోయాయి. ప్రతిరోజూ భయంతో మన ఆలోచనలను ఆపేసే ఒక పని చేసి విజయం సాధించాలని బాబాయ్ చెప్పారు. ఆయ‌న‌ చెప్పిన మాటలు చాలా గట్టిగా అనిపించాయి. ఆయన చెప్పాడని కాదు.. అందులో లోతైన భావాన్ని ఆద‌ర్శంగా తీసుకోవాలి... అని అన్నారు. వ‌రుణ్‌ గురించి మాట్లాడుతూ.. వ‌రుణ్ ఆలోచ‌న‌లు ఎప్పుడూ కొత్త‌గా ఉంటాయి. అత‌డు ప్ర‌తిసారీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉన్నాడు. త‌న ప్ర‌య‌త్నం చూసి చాలా సార్లు ఆనంద ప‌డ్డాను. కొన్నిసార్లు అసూయ ప‌డ్డాను. అంతరిక్షం ట్రైల‌ర్ చూసి జెల‌సీ ఫీల‌వుతున్నాను.. అదృష్టం ఉంటే త‌ప్ప ఇలాంటి అవ‌కాశాలు ద‌గ్గ‌రికి రావు. వ‌రుణ్‌ డెడికేష‌న్ గొప్ప‌ది.. త‌న‌ ఆలోచ‌న తీరే గొప్ప‌గా ఉంది.. అని పొగిడేశాడు. ఆలోచ‌నే మ‌న‌కు ఇష్ట‌మైన వారిని ద‌గ్గ‌ర‌కు చేస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న‌వారికి మంచే జ‌రుగుతుంద‌ని న‌మ్ముతాను.. అంటూ చ‌ర‌ణ్ ఉద్వేగంగా మాట్లాడాడు.

అభిమానుల‌నుద్ధేశించి మాట్లాడిన చ‌ర‌ణ్ అంతే ఎమోష‌న్ అయ్యాడు. ``మీరు స‌భ‌కు అటువైపు ఉన్నారు కాబ‌ట్టి అరుస్తున్నారు.. ఇక్క‌డ ఉన్నాం కాబ‌ట్టి మేం అర‌వ‌లేం.. కానీ పీలింగ్ మాత్రం ఒక్క‌టే.. మీలో ఉద్వేగ‌మే మాలోనూ ఉంటుంది. రెండు గుండెలు ఒక‌టే చ‌ప్పుడుతో కొట్టుకుంటాయి`` అంటూ ఫ్యాన్స్ ని ఆకాశానికెత్తేశాడు చెర్రీ. చ‌ర‌ణ్ ఆ వేదిక‌పై ఉండ‌గానే ఒక అభిమాని ఏడుస్తూ వ‌చ్చి చ‌ర‌ణ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చ‌ర‌ణ్ త‌న‌ని వారించే ప్ర‌య‌త్న‌మూ చేశాడు. చ‌ర‌ణ్‌ ని క‌లిసి షేక్ హ్యాండ్ ఇస్తూ అభిమాని ఎమోష‌న్.. అంద‌రినీ ట‌చ్ చేసింది. ప్ర‌తిసారీ మెగా ఫ్యాన్స్ ర‌చ్చ ఎలా ఉంటుందో నిన్న రాత్రి అంత‌రిక్షం వేడుక‌లోనూ అలానే సాగింది. ప‌వ‌ర్ స్టార్ గురించిన కేక‌లు ఈ వేడుక‌లో వినిపించాయి.
Tags:    

Similar News