రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో జక్కన్న రాజమౌళి ఒక సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాను కేవలం 120 కోట్లు వెచ్చించి ఒక కమర్షియల్ సినిమా గా చేద్దాం అని అనుకున్నాడు కానీ బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకుందాం అనుకుంటూ బోలెడు భాషల నుండి ముందుకి వస్తున్న ప్రొడ్యూసర్లని చూసి మనసు మార్చుకుని బడ్జెట్ ని 200 కోట్లుగా పెట్టుకున్నాడు అని రూమర్లు వినిపిస్తున్నాయ్.
ఇక్కడిదాక బాగానే ఉంది కాని 2019 సమ్మర్ లో విడుదల అవుతుంది అనుకున్నది కాస్త ఇప్పుడు 2020 సంక్రాంతి అయ్యేలా ఉంది. 150 వర్కింగ్ డేస్ అని లెక్కపెట్టుకున్నా ఇప్పుడు అది 250 వర్కింగ్ డేస్ కి మారిందని ఒక టాక్. అంటే దాదాపు 8 లేదా 9 నెలలు షూటింగ్ కే సరిపోతుంది మరి. ఇక రిలీజ్ ఎప్పటికి అయ్యేను? ఎంత ఈ సినిమా పైన బోలెడు అంచనాలు ఉన్నా ఈ విషయం తెలిశాక నిరుత్సాహపడిపోతున్నారు. చరణ్ కెరీర్ చాలా స్లో గా నడుస్తోంది. బ్రూస్ లీ సినిమా తర్వాత సంవత్సరం కంటే ఎక్కువ కాలం తర్వాత మళ్ళీ ధ్రువ తో మనముందుకు వచ్చాడు. గత సంవత్సరం కేవలం ఖైదీ నెంబర్ 150 లో ఒక పాట లో మెరవటం తప్ప తన సినిమా అంటూ ఏదీ విడుదల కానే లేదు.
రంగస్థలం కోసం కూడా చాలా కాలం షూటింగ్ చేశాడు. ఇప్పుడు కూడా చేతిలో బోయపాటి సినిమా, రాజమౌళి సినిమా తప్ప ఏమీ లేవు. ఈ సమయంలో ఒక్కో సంవత్సరానికి ఒక్కో సినిమా చప్పున కూడా చేసుకుంటూ పోలేకపోతే ఇంకెలా బాబు? ఇప్పుడు ఏకంగా దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుంటే ఫ్యాన్స్ గతేంటి?