పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడిన చరణ్

Update: 2019-01-07 06:25 GMT
సినిమా రంగానికి చెందిన వారు రాజకీయల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సాధారణ విషయమే. అసలు రాజకీయాలు నాకు తెలీదు.. అవి నాకు అర్థం కావు అనేవారు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భాలు ఉన్నాయి.  అలాంటప్పుడు ప్రతి స్టార్ హీరోకు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఏదో ఒక సమయంలో ఎదురవుతుంది.  తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇలాంటి ప్రశ్నే ఎదురయింది.

కొద్దిరోజుల కితం హైదరాబాద్ లో జరిగిన 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యతిథి గా టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారని తెలిసిందే.  ఆ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ చరణ్ స్పీచ్ ను మెచ్చుకున్నారు.  చరణ్ చక్కగా మాట్లాడుతున్నాడని రాజకీయాల్లోకి రావచ్చని సరదాగా అన్నారు.   రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చరణ్ ను ఇదే విషయంపై ప్రశ్నిస్తే "కేటీఆర్ గారు నా స్పీచ్ ను మెచ్చుకున్నారు నిజమే కానీ రాజకీయాల్లో రాణించాలంటే చక్కగా మాట్లాడం ఒక్కటే సరిపోదు.  నాకంటే బాగా మాట్లాడే వారు ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు.  రాజకీయాలలో ఉండడం అనేది బాధ్యతతో కూడుకున్నది. అందుకు చాలా నాలెడ్జ్.. డెడికేషన్ కావాలి" అంటూ ఇండైరెక్ట్ గా తనకు అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ తిరిగి ఇండస్ట్రీ కే వచ్చేశారు.  ప్రస్తుతం బాబాయ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉన్నారు. మరి ఫ్యూచర్లో చరణ్ ఎటువైపు అడుగులు వేస్తాడో వేచి చూడాలి.


Full View

Tags:    

Similar News