ఇవాల్టి రోజున ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఏదైనా ట్వీట్ చేయటం.. అందునా ప్రముఖులు.. సెలబ్రిటీలు అంటే చాలా దమ్ము.. ధైర్యం ఎక్కువగా ఉన్నట్లే చెప్పాలి. మోడీని వేలెత్తి చూపించేందుకు వెనుకాడుతున్న వేళ.. అందుకు భిన్నంగా సంచలన ట్వీట్ తో తెర మీదకు వచ్చారు చెర్రీ అలియాస్ రాంచరణ్ సతీమణి ఉపాసన. ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా తనకున్న చరిష్మాతో పాటు.. చరణ్ సతీమణి అన్న హోదా ఆమె మాట్లాడే ప్రతి మాట లెక్కలోకి తీసుకునేలా చేస్తోంది.
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోడీ భేటీ కావటం తెలిసిందే. దీనిపై ఉపాసన ట్వీట్ చేస్తూ.. దక్షిణాదిన పట్టించుకోకపోవటం తనను బాధించినట్లుగా ఆమె మోడీని ట్యాగ్ చేసి మరీ విమర్శించటం.. బాలీవుడ్ మాత్రమేనా? మిగిలిన వుడ్డుల్ని మోడీ ఎందుకు పట్టించుకోరన్న ప్రశ్నను తెర మీదకు వచ్చేలా చేసిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. ఈ అంశంపై రాంచరణ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉపాసన చేసిన ట్వీట్ ప్రధాని మోడీని విమర్శిస్తూ చేయలేదని.. చాలా గౌరవపూర్వకంగానే ఆమె తన ఆవేదనను తెలియజేసినట్లుగా వివరణ ఇచ్చారు. ఉపాసన ఆవేదనను ప్రముఖ నటి ఖుష్భూ మరోస్థాయికి తీసుకెళ్లారని చరణ్ చెప్పారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉపాసన చేసిన ట్వీట్ సంగతి తనకు ఎప్పటికో తెలిసిందన్నారు. అంటే.. చరణ్ కు చెప్పకుండానే మోడీని విమర్శించేలా ట్వీట్ పెట్టేసేలా ఉపాసన నిర్ణయం తీసుకున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ఏమైనా.. చెర్రీకి మాట వరసకు చెప్పకుండానే ప్రధాని మోడీ తీరును ప్రశ్నించేలా ట్వీట్ చేయటం అంటే.. ఉపాసన ధైర్యానికి.. సాహసానికి సలాం చేయాల్సిందే.