తనకు ‘రంగస్థలం’ లాంటి సినిమా అందించినందుకు దర్శకుడు సుకుమార్ కు జీవితాంతం రుణపడి ఉంటానని రామ్ చరణ్ అన్నాడు. ఈ చిత్ర శత దినోత్సవ వేడుకలో చరణ్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. సినిమా అనేది ఒకరి ఆలోచన నుంచి పుడుతుందని.. ‘రంగస్థలం’కు మూల స్తంభంగా నిలిచిన ఆ ఒక్కడు సుకుమార్ అని.. ఆయన ఎప్పుడైనా పెన్ను పట్టుకున్నారో అప్పుడే ‘రంగస్థలం’ లాంటి గొప్ప కథ మొదలైందని.. తనతో పాటు దేవిశ్రీ ప్రసాద్.. రత్నవేలు.. ఇంకా ఎంతోమంది ఇలా పని చేశామంటే అదంతా సుకుమార్ ఆలోచన వల్ల అని.. అదే ఈ చిత్రాన్ని వంద రోజుల వరకు తీసుకొచ్చిందని చరణ్ అన్నాడు. ఇందుకు సుకుమార్ జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. ఈ సినిమా వంద రోజులు ఆడిందంటే దాని వెనుక ఎంతోమంది కృషి.. కష్టం ఉన్నాయని చెప్పాడు.
దేవిశ్రీ పాటలకు డ్యాన్స్ చేయడం ఒక సవాల్ అని.. డ్యాన్స్ మాస్టర్లు తనతో కష్టపడి డ్యాన్సులు చేయించారని సమంత.. అనసూయ సహా అందరూ తమ తమ పాత్రల్ని అద్భుతంగా చేశారని చరణ్ చెప్పాడు. తన తండ్రి నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని.. ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయన్ని బాగా గమనించానని.. ఆయన కష్టం చూస్తే ఊరికే ఇంతమంది అభిమానం ఎందుకు వస్తుందని అనిపించిందని చరణ్ చెప్పాడు. నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉంటేనే తామంతా కూడా సంతోషంగా ఉంటామని అన్నాడు. ఇకపై మన ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమా బాగా ఆడాలని.. పరిశ్రమ బాగుండాలని చరణ్ ఆకాంక్షించాడు. మనం ఎదిగేటపుడు మనతో పాటు పది మందిని పైకి తీసుకురావాలని.. ఆ పది మందే మనం పడిపోయేటపుడు కాపాడతారని చరణ్ అన్నాడు.