అసలు తెలుగు స్టార్లు బ్రాండింగులు చేయాలనే కాని.. చాలా బ్రాండ్లు వీళ్ళ చేతిలో వచ్చిపడతాయి. కాని వివిధ కారణాలతో ఎందుకనో మనోళ్ళు చాలా బ్రాండ్స్ ను పట్టింకోరు. ఒక్క మహేష్ బాబు మాత్రమే చక్కగా వచ్చిన బ్రాండ్స్ అన్నీ రిప్రజెంట్ చేస్తూ తన సత్తా చాటుకుంటూ ఉంటాడు. ఆ తరువాత అల్లు అర్జున్ చేతిలో కూడా రెడ్ బస్ నుండి ఫ్రూటి వరకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ బ్రాండ్ ఎండార్సింగ్ విషయంలో స్పీడ్ పెంచాలని చూస్తున్నాడట.
నిజానికి అప్పట్లో డొకోమో వంటి బ్రాండ్లకు సౌత్ అంబాసిడర్ గా రామ్ చరణ్ రచ్చ చేశాడు. కాని తరువాత వాటిని వదిలేశాడు. పూర్తి సినిమాల్లో తేలిపోయాడు. అయితే ఇప్పుడు మాత్రం మరోసారి బ్రాండ్లను ఎంటర్టయిన్ చేయలని ఫిక్సయిపోయి.. తొలుతగా ఒక మొబైల్స్ అమ్మే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నాడు. హ్యాపీ మొబైల్స్ అనే సంస్థ వారు.. ''‘R you ready to C'' అంటూ ఒక యాడ్ ఇవ్వడంతో.. అక్కడ ఉన్న ఆర్.సి. అనే పెద్ద అక్షరాలను చూడగానే రామ్ చరణ్ అని అర్దమైపోయింది. ఆల్రెడీ అల్లు అర్జున్ లాట్ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి.. మెగా కజిన్స్ ఇద్దరూ భలే మొబైల్ షాపులను పట్టేశారు అంటూ కొంటెంగా కామెంట్ చేస్తున్నారు జనాలు.
ఏదేమైనా కూడా మన తెలుగు హీరోలు మాత్రం బ్రాండ్ల విషయంలో ఇంకా గట్టిగా దూసుకెళ్తేనే పోతుంది. మాకంత డబ్బులు అక్కర్లేదులే అని వీల్ళు అనుకోవచ్చు కాని.. సదరు బ్రాండ్లను ఎండార్స్ చేయడం వలన పబ్లిక్ లో ఇంకా స్టార్డమ్ పెరిగే ఛాన్సుంటుంది. షారూఖ్ ఖాన్.. హృతిక్ రోషన్.. రణవీర్ సింగ్ లు నార్త్ జనాలకు ఎక్కువగా చేరువైంది టివిల్లో కనిపించే యాడ్స్ చేయడం కారణంగానే. ఆ విషయం మనోళ్లు కూడా తెలుసుకుని ఫాలో అయిపోతే బెటర్.