రీమేక్ అయితే.. అది కథ కాదా??

Update: 2016-12-08 17:30 GMT
ప్రపంచ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్ అయిన హాలీవుడ్ లో కూడా ఎన్నో యురోపియన్ కొరియన్ సినిమాలను రీమేక్ చేసి విజయాలు కొడుతుంటారు. అలాంటప్పుడు రీమేక్ చేస్తే అదేదో పెద్ద పాపం అన్నట్లు ఫీలవ్వడంలో అర్దంలేదు. కొందరు స్టార్ హీరోలు రీమేక్స్ కు దూరంగా ఉన్నా కూడా.. చిరంజీవి.. రజనీకాంత్.. అమితాబ్.. సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు అందరూ రీమేకులు చేసినవారే. ఇక ఇదే విషయం గురించి ఇప్పుడు 'తని ఒరువన్' రీమేక్ తో మన ముందుకు వస్తున్న మెగా హీరో రామ్ చరణ్‌ ఒక ఆసక్తికరమైన ఆన్సర్ చెప్పాలి.

''రీమేకే ఎందుకు? కథలు లేవా?'' అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ''ఏ? రీమేక్ అయితే.. అది కథ కాదా?'' అని అడిగాడు రామ్ చరణ్. ''నాకు రీమేకా.. కొత్త కథా అనేంత పట్టింపు లేదు. రీమేకులు చేయకూడదు అనేంత ఈగో కూడా లేదు'' అంటూ నవ్వుతూ.. ''పక్కోళ్ళు హిట్టు కొట్టినప్పుడు దానిని తిరిగి మన జనాలకు చూపించడం తప్పేం కాదు. చేయొచ్చు'' అని సెలవిచ్చాడు చరణ్‌. ఇక తని ఒరువన్ రీమేక్ ప్రత్యేకించి ఎందుకు అంటే.. ''మనకు అలవాటైన హీరో సెంట్రిక్ ఫిలిం కాదు.. కొత్త కథ.. కొత్తరకం ప్రెజంటేషన్‌.. కాబట్టే ఈ సినిమాను చేశాను'' అన్నాడు.

మొత్తానికి రీమేక్స్ చేయకూడదు అని అనుకునేవారు కూడా మనస్సు మార్చేసుకునే రేపులో చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. నిజానికి రీమేక్స్ చేయడం అనేది మంచిదేలే కాని.. ఇక్కడ మనోళ్లు కూడా అసలు అటువంటి మంచి కథలు రాస్తే బాగుంటుందని తెలుగు సినిమా లవ్వర్స్ ఫీలింగ్. ధృవ.. ఖైదీ నెం 150.. కాటమరాయుడు.. వంటి సినిమాల కథలు మన రైటర్లు రాసిన మన సొంత కథలే అయితే.. ఆ తుత్తి వేరులే!!

Full View
Tags:    

Similar News