మెగా హీరో రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అద్బుతమైన కథతో.. పాత్రతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామరాజు వీడియో వచ్చిన విషయం తెల్సిందే. ఆ వీడియో అద్బుతం అంటూ ప్రశంసలు దక్కించుకుంది. చరణ్ విజువల్స్ కు మెగా ఫ్యాన్స్ కళ్లలో ఆనందం నిండి పోయిందట.
ఆ వీడియోతో జక్కన్న ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశాడు. ఏంటీ అంటే అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అంటూనే పోలీస్ యూనిఫార్మ్ లో చరణ్ ను చూపించబోతున్నట్లుగా ఆ వీడియోలో జక్కన్న హింట్ ఇచ్చాడు. ఈ విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అల్లూరి సీతారామరాజు పాత్రే కాని మీకు తెలియని విషయాలను నేను పూర్తిగా ఊహించి క్రియేట్ చేశాను అంటూ జక్కన్న గతంలోనే చెప్పాడు. కనుక అల్లూరి పాత్రలో చరణ్ ను పోలీసుగా జక్కన్న చూపించబోతున్నాడు.
చరణ్ ను పోలీసుగా చూడబోతున్నామనే విషయంలో మెగా ఫ్యాన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చరణ్ పోలీస్ అనగానే ఎక్కువ శాతం ఫ్యాన్స్ కు జంజీర్ గుర్తుకు వస్తుందట. హిందీలో చేసిన జంజీర్ చిత్రంతో చరణ్ దారుణమైన డిజాస్ట్రర్ ను చవిచూశాడు. పోలీసుగా చరణ్ ఏమాత్రం కరెక్ట్ కాదని ఆ సమయంలో అంతా అనుకున్నారు. ఆ తర్వాత ధృవ చిత్రంలో ఐపీఎస్ గా చరణ్ నటించి మెప్పించాడు. అయినా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు జంజీర్ ను గుర్తుకు తెచ్చుకుని భయపడుతున్నారట.
ఆర్‌ఆర్‌ఆర్ లో చరణ్ పోలీసు అయితే జంజీర్ ఫలితం రిపీట్ అవ్వనుందా అనే టెన్షన్ కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాని కొందరు మాత్రం ఇది చరణ్ సినిమా మాత్రమే కాదు జక్కన్న రాజమౌళి సినిమా అనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. అంటే హీరోల సెంటిమెంట్‌తో పని లేకుండా జక్కన్న రాజమౌళిని సూపర్ హిట్ చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. కనుక ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని కొందరు ఫుల్ క్లారిటీతో నమ్మకంతో చెబుతున్నారు.