మెగాస్టార్ కు వారసుడిగా తెరేంగేట్రం చేసిన చెర్రీ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను సినిమా ఓకే అనాలంటే తనకు కథ ముఖ్యమే కానీ దర్శకుడు ఎంతమాత్రం కాదని స్పష్టం చేశాడు. తాను మొదటి నుంచీ అదే సూత్రాన్ని ఫాలో అయ్యేవాడినని చెప్పాడు. తాను సినిమా ఓకే చెప్పానంటే అది కేవలం కథ నచ్చితే తప్పించి.. దర్శకుడ్ని చూసి ఎంత మాత్రం కాదన్నాడు.
వినాయక్ చిత్రానికి సైతం తాను కథ నచ్చి మాత్రమే ఓకే చేశానన్నారు. తనను కలిసే దర్శకులు ఎవరైనా..వారు చెప్పే కథలు కానీ ఇంప్రెస్ చేసేలా ఉంటే మాత్రమే తాను సైన్ చేస్తానని చెప్పాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చెర్రీని.. మరి మల్టీ స్టారర్ ఫిలిం చేస్తారా?అని అడిగితే.. తాను దేనికీ వ్యతిరేకం కాదని.. కాకుంటే.. అలాంటి ప్రాజెక్టులకు సైతం తనకు కథే ముఖ్యమని వెల్లడించాడు.
అతిలోకసుందరి శ్రీదేవిని అమితంగా ఇష్టపడే చరణ్ ను చెర్రీని ముద్దుగా పిలిచే విషయం తెలిసిందే.ఇంతకీ..ఆ పేరు ఎలావచ్చిందో తెలుసా?ఇంట్లో ఉన్న ఇద్దరు సిస్టర్స్ ను ముద్దుపేర్లతో పిలవటం..తనను మాత్రం ముద్దుపేరుతో పిలవకపోవటంతో..బుంగమూతి పెట్టేసి (చిన్నప్పుడు).. తనకో ముద్దుపేరు పెట్టి పిలవాలని గట్టిగా అడిగేశాడట. దాంతో.. మెగాస్టార్ చిరంజీవి చెర్రీ అనటం షురూ చేయటం.. సోషల్ మీడియా పుణ్యమా అని అదిప్పుడు అసలు పేరు కంటే ఎక్కువగా పాపులర్ అయిపోయింది.
ఇష్టమైన టీవీ ఛానల్స్ గురించి అడిగితే..యనిమల్ ప్లానట్..డిస్కవరీ అని చెప్పే చరణ్.. రాజకీయాల గురించి కదలిస్తే మాత్రం.. ఆచితూచి స్పందిస్తాడు. రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేదని.. కానీ.. అసలేం జరుగుతుంది? అన్న విషయం మీద మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతానని చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/