మంచు మనోజ్ లేటెస్టు మూవీకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. అందుకే ''గుంటురోడు'' సినిమా ఇప్పుడు భారీ హైప్ ను సొంతం చేసుకుంది. అయితే అసలు ఈ సినిమాకు వాయిస్ అందించాల్సింది మెగాస్టార్ కాదు తెలుసా? ఆయన పుత్రరత్నం చేయాల్సిన పనిని ఈ ఖైదీ నెం 150 పూర్తి చేశాడంటే నమ్ముతారా? నమ్మాల్సిందే.
ముందుగా గుంటూరోడు టీమ్ రామ్ చరణ్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నారట. ఇక చరణ్ కూడా ఓకే అనేయడంతో.. యునిట్ అంతా చరణ్ వాయిస్ కోసం ప్రిపేర్ అయిపోయారు. కట్ చేస్తే.. చరణ్ హైదరాబాద్ లో లేడు.. ఇక్కడ వాయిస్ ఓవర్ అర్జంట్. మనోళ్ళు ఒక రిలీజ్ డేటును అమాంతం ఫిక్స్ చేసుకోవడంతో.. తను రావడానికి ఇంకా లేటవుతుంది అని తెలిపాడట చరణ్. దానితో వెంటనే మెగాస్టార్ ను సంప్రదించడంతో.. ఆయన చకా చకా వాయిస్ ఓవర్ ఇచ్చేశారు.
ఆ విధంగా గుంటూరోడు సినిమాకు వాయిస్ ఇవ్వడంలో చరణ్ మిస్సయితే.. చిరంజీవి మహా ప్లస్సయ్యారు. అయితే చిరంజీవి ఈ వాయిస్ అందించేటపుడు కనీసం తనకు హింట్ కూడా ఇవ్వలేదని.. వచ్చి వాయిస్ ఇచ్చేసి ఎలా ఉందో చూడమని నాకు ఫోను చేశారు అంటున్నాడు మంచు మనోజ్. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/