రామ్ చరణ్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందన్న విషయం ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఆ మధ్య మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్ కి వచ్చి చిరు ఇంట్లో కథా చర్చలు సాగించినట్టు వార్తలొచ్చాయి. అది రామ్ చరణ్ తో సినిమాకోసమేనట. అయితే ఏమైందో ఏంటో కానీ... ఆ కాంబినేషన్ లో సినిమా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు మణి. ఓ పైలట్ ప్రేమకథతో తెరకెక్కుతున్న సినిమా అది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం.
అయితే ఇదివరకటిలాగా కాకుండా మణిరత్నం ఓ సినిమా సెట్స్ పై ఉండగానో తదుపరి చేయనున్న మరో చిత్రం గురించి కసరత్తులు షురూ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రామ్ చరణ్ తో సినిమా తెరపైకొచ్చింది. ఇటీవల చెర్రీకి మణి ఓ లైన్ వినిపించినట్టు సమాచారం. మణిరత్నం తనతో సినిమా చేయడమే గ్రేట్ అనుకొంటున్నారు రామ్ చరణ్. సో ఆయన ఒప్పుకోవడం గ్యారెంటీ అనేది పరిశ్రమ వర్గాల మాట.