డైరెక్టర్ మారుతి అంటే కొన్నాళ్ల క్రితం వరకూ ఓ బ్రాండ్ ఉంది. ఈ రోజుల్లో సినిమాతో మొదలయ్యి - బస్టాప్ - ప్రేమ కథా చిత్రం తర్వాత బూతు సినిమాల డైరెక్టర్ గా ముద్ర వేయించుకున్నాడు. మారుతీ పేరు తగిలించి ప్రమోషన్ చేసుకునేంతగా ఎదిగాడు. కానీ ఆ తర్వాత రూట్ మార్చేశాడు మారుతీ. క్లీన్ కామెడీలకు కేరాఫ్ అడ్రస్ అనేలా ఛేంజ్ అయిపోయాడు. కొత్తజంటతో అల్లు శిరీష్ కు హిట్ ఇచ్చి, భలేభలే మగాడివోయ్ చిత్రంతో నానికి బ్లాక్ బస్టర్ ఇచ్చి స్టార్ హీరోని చేసేశాడు.
ఇదే ఊపుతో వెంకటేష్ తో బాబు బంగారం చేసేందుకు అవకాశం దక్కించుకున్నాడు. గతంలో కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చిన వెంకీ.. సినిమా స్టార్ట్ చేయకుండానే వెనక్కి తగ్గాడు. ఇప్పుడా మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇంత గుర్తింపు సాధించినా.. మారుతీ ఇంకా స్టార్ డైరెక్టర్ కాదు. కారణం స్టార్ హీరోలను డైరెక్ట్ చేయకపోవడమే. ఇప్పుడా లోటు కూడా తీరిపోనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మారుతీతో ఓ మూవీ చేసేందుకు సై అన్నాడు. మారుతీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఖచ్చితంగా చేద్దామని మాటిచ్చాడట మారుతీ.
కానీ చెర్రీ-మారుతీ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదు. ప్రస్తుతం తనిఒరువన్ స్టార్ట్ చేస్తున్న చరణ్.. ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా, కొరటాల శివతో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే మారుతీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి చెర్రీ నాలుగో ప్రాజెక్ట్ అన్నమాట. రామ్ చరణ్-మారుతీ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి కనీసం రెండేళ్ల టైం పడుతుంది.