టాప్‌ స్టార్‌.. ఆ క్లబ్‌ లో మిస్సింగ్‌

Update: 2015-09-13 05:20 GMT
ఓవ‌ర్సీస్‌ ని కొల్ల‌గొట్టేయ‌డం.. టాలీవుడ్‌ లో లేటెస్ట్ స్ర్టాట‌జీ ఇది.  విదేశాల నుంచి డాల‌ర్లు ఎంత ఎక్కువ కురిపిస్తే అంత హీరోయిజం ఉన్న‌ట్టు ఫీల‌వుతున్నారంతా. అందుకే ఇప్పుడు కేవ‌లం తెలుగు రాష్ర్టాల మార్కెట్‌ నే కాదు ఓవ‌ర్సీస్ మార్కెట్‌ ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాల్సొస్తోంది. ఇప్ప‌టికైతే అర‌డ‌జ‌ను హీరోల‌కు విదేశాల్లో మార్కెట్ ఉంది. అమెరికాలో డాల‌ర్లు కురుస్తున్నాయ్‌.

మ‌హేష్‌ - ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ - బ‌న్ని - ఎన్టీఆర్‌ - ప్ర‌భాస్ ఈ ఐదుగురికి ఇంత‌కాలం విదేశాల్లో డాల‌ర్లు కురిశాయి. ఇప్పుడు ఇదే రేసులోకి నాని కూడా వ‌చ్చి చేరాడు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఓవ‌ర్సీస్‌ లో 1 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌ లో చేరి రికార్డులు సృష్టించింది. ఏ స్టార్ హీరో స్టాట‌స్ లేకుండానే నాని ఈ ఫీట్‌ ని అందుకున్నాడు. అంటే నానీ ఈ స‌క్సెస్‌ తో ఓవ‌ర్సీస్ మార్కెట్ లో చ‌ర‌ణ్‌ కి స‌వాల్ విసిరిన‌ట్టే. రామ్‌ చ‌ర‌ణ్ 50 కోట్ల వ‌సూళ్ల‌ను సునాయాసంగా తెచ్చే హీరోనే అయినా ఓవ‌ర్సీస్‌ లో మాత్రం ఇంత‌కాలం అత‌డి ప‌ప్పులు ఉడ‌క‌లేదు. ఇన్నేళ్ల‌లో అత‌డు న‌టించిన ఏ సినిమా 1 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌ లో చేర‌నేలేదు. చెర్రీ న‌టించే యాక్ష‌న్ సినిమాల‌కు అమెరికాలో అంత గిరాకీ లేనేలేదు. రొటీన్ యాక్ష‌న్‌ - ఫ్యాక్ష‌న్‌ తో ఎన్నారైల‌ను మెప్పించాలంటే అంత వీజీ కాదు. ఈ విష‌యంలో  చ‌ర‌ణ్ స‌క్సెస్ కాలేక‌పోయాడు. అత‌డు న‌టించిన మ‌గ‌ధీర సైతం 1 మిలియ‌న్ మార్క్‌ కి చేర‌లేక‌పోయింది. ఫ్యామిలీ కంటెంట్ ఉన్న గోవిందుడు అంద‌రివాడేలే కూడా ఆ మార్క్‌ ని ట‌చ్ చేయ‌లేక‌పోయింది.

ఇంటి దగ్గర ఈ రేంజు హిట్లు కొడుతున్న రామ్‌ చరణ్‌.. ఒక టాప్‌ స్టార్‌ హీరో.. అసలు ఓవర్‌ సీస్‌ లో 1 మిలియన్‌ క్లబ్‌ లో చేరకపోవడం అనేది పెద్ద విషయమే. మైండ్‌ బ్లోయింగ్‌ విషయం అనే చెప్పాలి. అభిమానులను ఇప్పుడిది కలవరపెట్టేస్తోంది. చూద్దాం మరి.. శ్రీను వైట్ల సపోర్టు ఉంది కాబట్టి బ్రూస్‌ లీ తో ఏమైనా అక్కడ మిలియన్‌ డాలర్ల ఖాతా తెరుస్తాడేమో.

Tags:    

Similar News