మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తన 15వ చిత్రం దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగులో రూపొందుతోన్న చిత్రం పాన్ ఇండియా వైడ్ అనువాదం కానుంది. ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ తో సినిమాకి పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజ్ ప్రతిష్టాత్మకగా నిర్మిస్తుంది. ఈ బడ్జెట్ కేవలం అంచనా మాత్రం. అంతకు మించి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది.
సాధారణంగా శంకర్ సినిమా బడ్జెట్ ఎప్పుడు పెరుగుతుందే తప్ప తగ్గే సమస్యలేదు. మరి తమిళ్ డైరెక్టర్ అయి శంకర్ ఈ చిత్రాన్ని తమిళ్ లో కూడా చేసి ఉండొచ్చు! కదా అని కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం తెలుగులోనే తీస్తున్నారు..ఏక కాలంలో రెండు భాషల్లోనూ చేయడానికి ఆస్కారం ఉన్నాశంకర్ ఆ దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని రకాల వివరణలు వినిపిస్తున్నాయి. శంకర్ తొలిసారి టాలీవుడ్ కి వచ్చి డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది. అంతకుమించి భారతీయుడు-2 మధ్యలో ఆగిపోయిన నేపథ్యంలో కొన్ని వ్యక్తిగత కారణాలు గానూ శంకర్ మాతృ భాషలో సినిమ చేయడానికి అయిష్టత చూపించినట్లు కథనాలొచ్చాయి. తమిళ ఇండస్ర్టీలో తనపై ఉన్న నెగివిటీకి ప్రతిగానే శంకర్ హైదరాబాద్ వచ్చిసినిమా తీస్తున్నారు అని మరికొంత మంది వాదన.
మరోవైపు తెలుగు సినిమాలు తమిళ్ లో ఆదరించరు అన్న బలమైన కారణం ఉంది. భాషా బేధం తమిళ్ లో ఎక్కువగా చూపిస్తారని...తెలుగులో ఎంత పెద్ద హీరో సినిమా అయినా కోలీవుడ్ లో రిలీజ్ అయ్యే సరికి ఆ సినిమాపై వివక్షచూపిస్తారు తప్ప...ప్రోత్సహించడం తక్కువని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్..సహా కొంత మంది హీరోలు రెండు భాషల్లోనూ సినిమాలు చేసారు.
తెలుగు అవి పెద్ద హిట్ అయ్యాయి గానీ..తమిళ్ లో మాత్రం యావరేజ్ గా కూడా ఆడలేదు. చరణ్ కూడా ఆ కారణంగానూ శంకర్ పై ఒత్తిడి తీసుకురాకపోయి ఉండొచ్చు. అయిప్పటికీ ఈ చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో అక్కడ రిలీజ్ చేస్తారు. శంకర్ బ్రాండ్ తో గనుక సక్సస్ అయితే చరణ్ కి గుర్తింపు దక్కుతుంది. అటుపై ఆర్సీ 16వ చిత్రాన్ని తెలుగుతో పాటు ఏక కాలంలో తమిళ్ లోనూ చేసినా ఆశ్యర్యపోనవసరం లేదు.
ఇప్పటికే హిందీ సహా హాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి గానీ..తమిళ్ స్టార్ డైరెక్టర్లు మాత్రం మేము ఉన్నా నీ కోసమంటూ ఒక్కరూ వచ్చింది లేదు. అది జరగాలంటే కోలీవుడ్ లో మార్కెట్ బిల్డ్ చేసుకోవాలి. చరణ్ ఆ విషయాన్నిసీరియస్ గా తీసుకునే అవకాశం లేకపోలేదు. దేశం క్రేజ్ ఖండాలే దాటిన వేళ....పరాయి రాష్ర్టాన్ని చేధించడం పెద్ద కష్టమేం కాదు అన్నది అభిమానుల నమ్మకం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.