ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ సమీపించడంతో యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి...చరణ్..తారక్ ముంబైలో తిష్టవేసి అక్కడ పబ్లిసిటీపైనే ఫోకస్ పెట్టారు. రిలీజ్ కి ఇంకా పదకొండు రోజులే సమయం ఉండటంతో సోషల్ మీడియా టీమ్ కూడా వేగం పెంచింది. ఇప్పటికే పోస్టర్లతో కావాల్సినంత బజ్ తీసుకొచ్చిన టీమ్ ఇప్పుడు అదే మూవ్ మెంట్ ని కొనసాగించే పనిలో ఉంది. దీనిలో భాగంగా మరో రెండు కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది. ఒకటి చరణ్ కి సంబంధించిన పోస్టర్ కాగా...మరోకటి తారక్ పోస్టర్.
ఈ పోస్టర్ లో చరణ్ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నారు. చేతిలో లాఠీ పట్టుకుని ప్రత్యర్దులపై ప్రతాపం చూపిస్తున్నాడు. బ్రిటీష్ కాలం నాటి పోలీస్ డ్రెస్ లో చరణ్ ఆహార్యం చక్కగా కుదిరింది. ఈ పోస్టర్ లో మరో ప్రత్యేకత ఉంది. చరణ్ బ్యాక్ గ్రౌండ్ లో `రౌద్రం..రుధిరం` హైలైట్ అవ్వగా రణం హైడ్ అయింది. ఇక తారక్ రెండు చేతుల్లో భగ భగ మండుతోన్న కాగాడాలతో శత్రువులపై సమరశంఖం పూరించినట్లు కనిపిస్తుంది. ఇందులో తారక్ కొమరం భీమ్ ఆహార్యంతో కనిపిస్తున్నారు. తారక్ బ్యాక్ గ్రౌండ్ లో `రణం..రుధిరం` హైలైట్ అవ్వగా రౌద్రం హైడ్ అయింది. అంటే రెండు పాత్రల మధ్య వ్యత్యాసాన్ని చూపించడం కోసం పోస్టర్ల డిజైన్ చేశారని అనుకోవచ్చు. నిప్పులా చెలరేగే చరణ్.. నీరులా దూసుకుపోయే తారక్ ని ఈ చిత్రంలో చూడబోతున్నామని హింట్ ఇచ్చారు.
రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇలాంటి పోస్టర్లు మరిన్ని రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో `ఆర్ ఆర్ ఆర్` పై అంచనాలు ఆకాశన్నంటుతున్న సంగతి తెలిసిందే. జనవరి 7వ తేదీ రాక కోసం అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. మరోసారి రాజమౌళి తనదైన మేకింగ్ తో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ఓపెనింగ్ రికార్డులపైనా భారీ అంచనాలేర్పడ్డాయి.