ఈ నెల 11న రానున్న వినయ విధేయ రామ కౌంట్ డౌన్ తో మెగా ఫ్యాన్స్ కు నిద్ర పట్టడం లేదు. రంగస్థలం తర్వాత వస్తున్న మూవీ కావడం మెగా హీరోలకు ఈ మధ్య చెప్పుకోదగిన హిట్ లేకపోవడంతో దీని మీద మాములు అంచనాలు లేవు. ఊర మాస్ కంటెంట్ తో బోయపాటి శీను స్టైల్ లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టైటిల్ లో ఉన్న సున్నితత్వం కథలో ఉండదని అర్థమైపోయింది. అందుకే యాక్షన్ ఎపిసోడ్స్ కే పైసా వసూల్ అయిపోతాయని అభిమానులు ధీమాగా ఉన్నారు.
ఇక పొతే ఈ మధ్యకాలంలో వదిలిన పోస్టర్స్ లో రామ్ చరణ్ మ్యాడ్ మాక్స్ తరహలో ఛాతి మీద టాటూలతో కండలు తిరిగిన దేహంతో చొక్కా లేకుండా కనిపించడం మాములు కాక రేపలేదు. పైగా ట్రైలర్ లో ఈ ఫైట్ ని బాగా హై లైట్ చేయడంతో అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. చరణ్ భీభత్సం చేసే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందట. ఏదో ఐదు పది నిముషాలు కాదు ఏకంగా అరగంట పాటు బీహార్ నేపధ్యంలో కరుడు గట్టిన విలన్ల మధ్య వివేక్ ఒబెరాయ్ డెన్ లో ఇదంతా ఉంటుందని తెలిసింది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాలో చూడని రచ్చ రంబోలా ఫైట్స్ అందులో ఉంటాయట. అయితే చరణ్ అక్కడికి వెళ్ళడానికి అన్నయ్య ప్రశాంత్ పాత్రకు ఏదో కీలకమైన కనెక్షన్ ఉంటుందని తెలిసింది. మొత్తానికి హైప్ ని అంతకంతా పెంచుకుంటూ పోతున్న విధేయ రాముడు చరణ్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ జరుపుకుంది
Full View