బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' కర్టన్ రైజింగ్ ఎపిసోడ్ వచ్చేసింది. రామ్ చరణ్ గెస్ట్ గా హాజరు అయిన ఈ కర్టెన్ రైజింగ్ కార్యక్రమంలో ప్రేక్షకులకు గేమ్ యొక్క రూల్స్ చెప్పడంతో పాటు షో యొక్క ఫార్మట్ ను క్లీయర్ గా ఎన్టీఆర్ తెలియజేశాడు. షో లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మద్య సాగిన సంభాషణలు చర్చలు ఆసక్తికరంగా సాగాయి. ఎన్టీఆర్ తాము చరిత్రను సృష్టించబోతున్నాం అంటూ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన విషయాలను చెబుతూ షోను ప్రారంభించి.. రామ్ చరణ్ ను ఆహ్వానించాడు.
రామ్ చరణ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కోసం ఆడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. రాజమౌళి నుండి మొదలుకుని పవన్ కళ్యాణ్ వరకు ఎన్నో విషయాలను వీరు మాట్లాడటం జరిగింది. చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల గురించి రామ్ చరణ్ మాట్లాడటంతో పాటు ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ షో ను చాలా సరదాగా నడిపారు. అప్పుడే అయ్యిందా అనేట్లుగా ఇద్దరు రామ లు కూడా షో ను చాలా సందడిగా కొనసాగించారు. ఎన్టీఆర్ హోస్ట్ సీటుకు న్యాయం చేస్తాడా అనే అనుమానం ఎవరికి లేదు. ఖచ్చితంగా గత అనుభవం దృష్ట్యా ఎన్టీఆర్ ఓ రేంజ్ లో షో ను సక్సెస్ ను చేస్తాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే షో ను ఎన్టీఆర్ రక్తికట్టించాడు అనడంలో సందేహం లేదు.
ఎన్టీఆర్ గతంలో బిగ్ బాస్ షో కు హోస్టింగ్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ ను ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా ప్రేక్షకులు చూశారు. ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా ఈ షో కు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సినిమా విడుదల అయ్యి కూడా చాలా కాలం అయ్యింది. దాదాపుగా ఎన్టీఆర్ ను వెయ్యి రోజుల తర్వాత చూసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. నేటి ఎపిసోడ్ లో కూడా చరణ్ కొంత సమయం ఉంటాడు. ఆ తర్వాత నుండి షో రెగ్యులర్ కంటెస్టెంట్స్ తో సాగబోతుంది.