చరణ్‌ సినిమాలన్నింటికి ఇదే పరిస్థితి!!

Update: 2018-10-27 14:30 GMT
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గత చిత్రాలు ‘ధృవ’ - ‘రంగస్థలం’లతో పాటు ఇంకా కొన్ని ఇతర చిత్రాలు కూడా అనుకున్న సమయానికి విడుదల కాలేక పోయాయి. ఒకటి రెండు సార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటే మార్చికి వాయిదా వేయాల్సి వచ్చింది. అంతకు ముందు ధృవ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనుకున్నా షూటింగ్‌ ఆలస్యం వల్ల డిసెంబర్‌ లో విడుదల చేయాల్సి వచ్చింది. చరణ్‌ ఈమద్య కాలంలో ముందుగా చెప్పినట్లుగా కాకుండా ఆలస్యంగా వస్తున్నాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న బోయపాటి మూవీని కూడా దసరా లేదా దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. కాని షూటింగ్‌ అనుకున్నట్లుగా జరగక పోవడంతో సంక్రాంతికి వాయిదా వేశారు.

షూటింగ్‌ ప్రారంభించిన మొదట్లో రామ్‌ చరణ్‌ చాలా లేజీగా ఉంటాడని, షూట్‌ కు ఎక్కువ సెలవులు తీసుకుంటాడంటూ సినీ వర్గాల్లో ఒక టాక్‌ ఉంది. అందుకే చిత్రీకరణ ఆలస్యం అవుతుందని అంటున్నారు. చివర్లో తాను టెన్షన్‌ పడి, దర్శకుడిని టెన్షన్‌ పెట్టి - డే అండ్‌ నైట్‌ కష్టపడి సినిమాను పూర్తి చేస్తాడని ఇప్పటి వరకు ఆయనతో వర్క్‌ చేసిన వారు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. మొదట్లో చాలా లైట్‌ గా ఉండే చరణ్‌, ఆ తర్వాత స్పీడ్‌ పెంచినా కూడా విడుదల సమయంలో దర్శకుడిపై ఒత్తిడి పడుతూనే ఉంటుందని కొందరు అంటున్నారు.

చరణ్‌ గత చిత్రాల మాదిరిగానే ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం కూడా చాలా స్లోగా తెరకెక్కుతుంది. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న దర్శకుడు బోయపాటి మాత్రం చాలా టెన్షన్‌ తో ఉన్నాడట. మరో వైపు హీరో చరణ్‌ మాత్రం చాలా తాపీగా ఫ్యామిలీతో - ఫ్రెండ్స్‌ తో సరదాగా గడుపుతూ - అయ్యప్ప మాల వేసుకుని ఉన్నాడు. విడుదల తేదీ ముంచుకు వచ్చిన తర్వాత చరణ్‌ హడావుడిగా వచ్చి మిగిలిన బ్యాలన్స్‌ ను పూర్తి చేస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట. చివరకు ఎక్కువ కష్టపడే బదులు, ముందు నుండే సినిమా కోసం అనుకున్న సమయం కేటాయిస్తే సరిపోతుంది కదా చరణ్‌ అంటూ కొందరు ఆయనతో చెప్పాలని అనుకున్నా చెప్పలేక పోతున్నారట.
Tags:    

Similar News