హృదయాన్ని కదిలించే ఘటనలు కొన్నే ఉంటాయి. అలాంటి అరుదైన సన్నివేశం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎదురైందట. ప్రస్తుతం సైరా చెన్నయ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్ తనకు ఎదురైన ఆ అనుభవాన్ని స్వయంగా వెల్లడించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాని చూశాను. ఆ సినిమా చూసినప్పుడు సేతుపతి నటన కదిలించింది. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్ కి కన్నీళ్లు పెట్టుకున్నాను అని అన్నారు రామ్ చరణ్. అలాగే సైరా చిత్రంలో తన పాత్రను వివరించేందుకు వెళ్లినప్పుడు తనని ఐదు నిమిషాల పాటు హత్తుకుని ఎమోషన్ కి గురయ్యానని ఆ పాత్ర తనను అంతగా కదిలించిందని చరణ్ అన్నారు. కొన్నేళ్లలో నచ్చిన సినిమా 96. లెక్కలేనన్ని సార్లు చూశానని అన్నారు. ఆ సినిమాని ఎప్పుడు చూసినా ఎమోషన్ అయిపోతానని అన్నారు.
నిజమే.. రంగస్థలం చిత్రంలో చెర్రీ నటనకు తెలుగు ఆడియెన్ అంతే ఇదిగా ఎమోషన్ అయ్యారు. చెవులు వినిపించని చిట్టిబాబును ఒక్క సెకనులో ఏమార్చి అన్నను దారుణంగా హతమారుస్తారు. ఆ సన్నివేశంలో చరణ్ నటనకు ఎమోషన్ కానివాడు ఉండడు. ఒక గొప్ప పెర్ఫామర్ గా నిరూపించుకున్నాడు రామ్ చరణ్ అందుకే ఇంకో పెర్ఫామర్ ని అంతగా మెచ్చుకోగలిగారన్నమాట. సైరా చిత్రంలో ఉయ్యాలవాడకు అనుచరుడిగా.. తమిళుడైన వీరుడిగా సేతుపతి నటించారు. సైరా చిత్రంలో ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్ ఉన్నాయని కొణిదెల ప్రొడక్షన్స్ బృందం నమ్మకంగా చెబుతోంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్ అభిమానుల్ని థియేటర్లకు పదే పదే రప్పిస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజవుతున్న ఈ సినిమా ప్రపంచదేశాల్లో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.