మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న చరణ్ 'బ్రూస్ లీ' తర్వాత మాత్రం రూట్ మార్చి 'ధృవ'.. 'రంగస్థలం' లాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా 'రంగస్థలం' సినిమా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించింది. చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయిన తీరు మెగా పవర్ స్టార్ కు భారీ ప్రశంశలు తెచ్చిపెట్టింది. కానీ అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' కు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇలాంటి ఊర మాస్ సినిమాను చెర్రీ ఎందుకు చేశాడు? చరణ్ చేసిన డిఫెరెంట్ సినిమాలను ఆదరిస్తున్న తరుణంలో మళ్ళీ మసాలా సినిమాకు ఓటేసిన కారణం ఏంటి?
చరణ్ ప్రత్యేకంగా ఈ సినిమాను ప్లాన్ చెయ్యలేదట. మూడున్నరేళ్ళ క్రితమే బోయపాటి శ్రీను ఈ సినిమా కథ చెప్పాడట.. అప్పుడే ఈ సినిమాను చేసేందుకు చరణ్ కూడా రెడీ అయ్యాడట. కానీ బోయపాటి మాత్రం చరణ్ కోసం ఒక పవర్ఫుల్ స్టొరీతో వస్తానని ఎక్కువ సమయం తీసుకున్నాడట. చరణ్ మాత్రం ఆ సినిమా 'రంగస్థలం' తర్వాతే పట్టాలెక్కుతుందని ఊహించలేదట. ఈమధ్య తెలుగు ప్రేక్షకులు రియలిస్టిక్ గా ఉండే సినిమాలు ఇష్టపడుతున్నారు. దీంతో అలాంటి సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. మాస్ మసాలా సినిమాలు తగ్గిపోయాయని.. ఇలాంటి సమయంలో ఒక పర్ఫెక్ట్ మసాలా సినిమాతో వస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తారని మాత్రం భావించాడట.
చరణ్ ఆలోచించిన విధానం లాజికల్ గానే ఉందిగానీ బోయపాటి కాస్త ఓవర్ గా వెళ్ళకుండా సినిమాను తీర్చిదిద్ది ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేదేమో. ఏదేమైనా చరణ్ ఒకటి మాత్రం ప్రూవ్ చేశాడు. సినిమాకు మొదటి షోతోనే నెగెటివ్ టాక్ వచ్చినా నలభై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం అనే ఫీట్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లే చెయ్యగలరు.. ఇప్పుడు చరణ్ కూడా బాబాయ్ బాటలో అలా చేయగలనని ప్రూవ్ చేశాడు. బాబాయ్ కి తగ్గ అబ్బాయ్ కదా!