అప్పుడే రికార్డుల వేట మొదలెట్టాడా

Update: 2016-12-01 02:13 GMT
రామ్ చరణ్ మూవీ ధృవ.. టాలీవుడ్ రికార్డులను తుడిచి పెట్టేస్తుందని.. తిరగరాసేస్తుందని మెగా ఫ్యాన్స్ బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నారు. థియేట్రికల్ ట్రైలర్ తో మొదలుపెట్టి.. ఇప్పటికే ఈ పని మొదలుపెట్టేశాడు చెర్రీ. కేవలం 5 రోజుల్లోనే 45లక్షలకు పైగా యూట్యూబ్ వ్యూస్ ను సాధించడం చూస్తే.. ధృవపై ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది.

ఈ అంచనాలకు తగిటనట్లుగానే రిలీజ్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. ఓవర్సీస్ లో ఇప్పటివరకూ రామ్ చరణ్ తన స్టామినా చూపలేకపోయాడన్న మాట వాస్తవమే. అందుకే ఈ సారి ఆ లోటు కూడా తీర్చేసేందుకు చెర్రీ డిసైడ్ అయిపోయాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన స్టైలిష్ కాప్ డ్రామా కావడంతో.. ఓవర్సీస్ లో కూడా అన్ని ఏరియాల్లోనూ బాగానే బజ్ ఉంది. దీనికి తగ్గట్లుగానే ఏకంగా 202 స్క్రీన్స్ లో ధృవ రిలీజ్ కానుంది. అన్ని సెంటర్లలోను ఇప్పటికే ప్రీమియర్స్ కూడా ఫైనల్ అయిపోవడం విశేషం.

యూఎస్ లో 200లకు పైగా స్క్రీన్స్ లో ఓ తెలుగు మూవీకి ప్రీమియర్స్ పడడం ఇదే మొదటిసారి. మిలియన్ డాలర్ మార్క్ ను చెర్రీ అందుకోలేకపోయాడనే విమర్శలు ఉన్నా.. ధృవతో 1.5మిలియన్ డాలర్ల మార్కును చెర్రీ అందుకోనున్నాడని ట్రేడ్ జనాలు అంటున్నారు. ప్రీమియర్స్ తోనే ఇందులో సగం మొత్తం వచ్చేసే ఛాన్స్ ఉందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News