రారారా... రాంచ‌ర‌ణ్ పాత్ర ఏంటో తెలిసిపోయింది !

Update: 2018-05-27 16:53 GMT
సినిమాలో కాంబినేన్స్ హైప్‌ ను క్రియేట్ చేస్తుంటాయి. కొత్త సినిమా మొద‌లవుతుందంటే... ఆ క‌థా చ‌ర్చ‌ల కంటే ద‌ర్శ‌క నిర్మాత హీరో కాంబినేష‌న్లే ఎక్కువ చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అయితే, తెలుగు సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం న‌డుస్తున్న జ‌న‌రేష‌న్‌ లో రాజమౌళి-రాంచ‌ర‌ణ్‌-ఎన్టీఆర్  కాంబినేష‌న్ ఇపుడు టాలీవుడ్‌ లో భారీ చ‌ర్చ‌కు దారితీస్తుంది. బ‌డ్జెట్ ప‌రంగా బాహుబ‌లి కంటే త‌క్కువే ఉండొచ్చు గాని తారాగ‌ణం మాత్రం భారీగా ఉంటుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది.

అయితే, ఈ సినిమాలో పాత్ర‌ల‌పై అనేక రూమర్లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా రాంచ‌ర‌ణ్ పాత్ర‌పై చాలా రూమ‌ర్లు వ‌చ్చాయి. వాటిని విని చ‌ర‌ణ్ కొన్ని సార్లు విసుక్కుని - ఇంకొన్ని సార్లు న‌వ్వుకుని కాలం గ‌డిపారు. ఇపుడు ఆయ‌న పాత్ర‌పై క్లారిటీ వ‌చ్చేసింది. రారారా లో రాంచ‌ర‌ణ్ ది పోలీసు పాత్ర‌. అత‌ను ఒక సీఐగా క‌నిపించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే రాంచ‌ర‌ణ్ రెండు సార్లు పోలీసు పాత్ర‌ల్లో క‌నిపించారు. వాటిలో ఒక‌టి ధృవ‌ హిట్ కాగా మ‌రోటి తూఫాన్‌ బిగ్గెస్ట్ ప్లాప్‌. మొత్తానికి ముచ్చ‌ట‌గా మూడోసారి రాంచ‌ర‌ణ్ పోలీసులా క‌నిపించి అల‌రించ‌బోతున్నారు. అంటే... ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీసు ఆఫీస‌రుగా రాంచ‌ర‌ణ్ ఎప్ప‌టికీ నిలిచిపోయే పాత్ర పోషించ‌డం గ్యారంటీ అంటున్నారు.

మ‌రి రాంచ‌ర‌ణ్ పోలీస్ అయితే ఎన్టీఆర్ పాత్ర ఏమై ఉండొచ్చు అనే కొత్త ఊహ మొద‌లైంది. రాంచ‌ర‌ణ్ పాత్రను బ‌ట్టి చూస్తే ఎన్టీఆర్ ఒక డిటెక్టివ్‌గా గాని, ఒక నాయ‌కుడిగా గాని క‌నిపించే అవ‌కాశం ప‌రిశీల‌న‌లో ఉండొచ్చు. డిటెక్టివ్ అయితే మాత్రం ఈ రెండు పాత్ర‌ల కాంబినేష‌న్ అదిరిపోతుంది. ఆ ఇద్ద‌రు ఇంటెలిజెంట్ విల‌న్ తో గేమ్ ఆడితే ఆ మ‌జాయే వేరు.
    

Tags:    

Similar News