ఫోటోస్టొరీ: క్యూట్ ఆపిల్ తో చెర్రీ

Update: 2019-07-15 08:04 GMT
నటి.. టీవీ హోస్ట్..నిర్మాత మంచు లక్ష్మి పేరు తెలియని తెలుగువారు ఎవరుంటారు చెప్పండి? డాటర్ ఆఫ్ మోహన్ బాబుగా ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ఎన్నో సార్లు తన సత్తాను చాటారు.  హాలీవుడ్ సీరియల్స్ లో కూడా మంచు లక్ష్మి నటించిన విషయం తెలిసిందే.  ఇక ఇండస్ట్రీలో ఉన్న అందరూ సెలబ్రిటీలు మంచు లక్ష్మికిమంచి ఫ్రెండ్స్.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అందుకు ఎక్సెప్షన్ కాదు.  మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.  తాజాగా ఆవిడ తన ముద్దుల కూతురు ఆపిల్.. రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

ఈ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసిన మంచు లక్ష్మి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "ఈ ఫోటో నన్ను జ్ఞాపకాల్లోకి తీసుకుపోతుంది. నావి ఇలాంటి ఫోటోలే మీ నాన్నగారితో (మెగాస్టార్ చిరంజీవి) ఉన్నాయి.  ఆలోచించి చూస్తే ఈ జీవితం ఫుల్ సర్కిల్ లాగా తిరిగివచ్చినట్టుంది.  ఇది ఎంతో అందమైన ప్రయాణం.  మనం ఎన్నో ఏళ్ళు ఇలా కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉంది. నీకు పిల్లలు పుట్టినపుడు ఆపిల్ ఒక పెద్దక్క లాగా ఉండడం చూడాలని ఉంది.. హిహి.  అన్నట్టు ఇన్ స్టా ఫ్యామిలీకి స్వాగతం రామ్ చరణ్" అంటూ పెద్ద క్యాప్షన్ పెట్టారు.

ఈ ఫోటోలో చరణ్ ఒడిలో చిరునవ్వులు చిందిస్తూ ఆపిల్ భలే క్యూట్ గా ఉంది. ఈ ఫోటో నెటిజన్లకు తెగ నచ్చింది.  ఈ అందమైన అనుబంధం ఇలాగే కొనసాగాలని కొందరు కోరుకున్నారు.  బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టారు మేడమ్ అంటూ కొందరు మెచ్చుకున్నారు.  ఈ ఫోటోకు దాదాపు అందరూ క్యూట్ అని.. లవ్లీ అని మెసేజులు పెట్టడం విశేషం.  
Tags:    

Similar News