జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యూఎస్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన అమెరికా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నారై లను కలుస్తున్నాడు. తాజాగా ఒక మీటింగ్ లో నాలుగు వేల మంది ఎన్నారైలు హాజరుకావడంతో పవన్ పట్ల వారికున్న అభిమానం మరోసారి వ్యక్తమైంది. పవన్ తన టిపికల్ స్టైల్ లో ఆవేశంగా స్పీచ్ ఇవ్వడం.. పలు అంశాలపై మాట్లాడడం అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ స్పీచ్ పై స్పందించాడు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇలా పోస్ట్ చేశాడు.."మీ భయాన్ని అధిగమించేందుకు మిమ్మల్ని భయపెట్టే పనిని రోజూ చేయండి. అన్నిటికంటే భయం ఏంటంటే.. మార్పును చూసి భయపడడం. నేను ఇంతవరకూ విన్న మోటివేషనల్ స్పీచుల్లో ఒక బెస్ట్ స్పీచ్. ది మ్యాన్. ది లీడర్.. ది విజనరీ పీఎస్ పీకె."
చరణ్ తన బాబాయ్ పై అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోడు. అలాగే బాబాయికి కూడా చెర్రీ అంటే ఇష్టమే. 'రంగస్థలం' సక్సెస్ మీట్ లో ఇద్దరి మధ్య ప్రేమ ఏ రేంజ్ లో ఉందో చూశాం కదా? ఇప్పుడు బాబాయ్ అదరగొట్టే స్పీచ్ ఇస్తే చెర్రీ స్పందించకుండా ఉంటాడా?