రామ్ చరణ్ మూవీ రంగస్థలం గురించి ట్రేడ్ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీడియం బడ్జెట్ తో రూపొందిన భాగమతి.. నాగ శౌర్య ఛలో మినహాయిస్తే.. ఇప్పటివరకూ ఈ ఏడాది టాలీవుడ్ సరైన హిట్ ను చూడలేదు. ఇక ఓవర్సీస్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం రిలీజ్ గురించి ఇండస్ట్రీ అంతటా ఆసక్తి కనిపిస్తోంది.
ఈ చిత్రానికి ఓవర్సీస్ రైట్స్ రూపంలో 9 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఈ మొత్తం రికవర్ కావాలంటే.. కనీసం 2.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఓవర్సీస్ లో రామ్ చరణ్ కు ఇది పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. ధృవ మినహాయిస్తే చెర్రీకి మిలియన్ డాలర్ మూవీ లేదు. అయితే.. ఇక్కడ సుకుమార్ మార్కెట్ చాలా స్ట్రాంగ్. సుక్కు పేరు చెబితో విపరీతమైన కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటిది మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో రెండున్నర మిలియన్ డాలర్ల టార్గెట్ పెద్ద విషయం కాబోదనే అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే.. భారీ రిలీజ్ విషయంలో మాత్రం ట్రేడ్ వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ప్రీమియర్ ల టాక్ ను అనుసరించి థియేటర్ల కౌంట్ ను పెంచాలని నిర్ణయించుకున్నారట. మరి ఓవర్సీస్ లో తన మార్కెట్ ని రామ్ చరణ్ రెట్టింపు చేసుకుంటాడో లేదో చూడాలి.