ఆ నాలుగు భాషల్లో కూడా రంగస్థలం

Update: 2018-04-13 06:23 GMT
ఒక కథ హిట్టయితే ఇతర భాషల్లోకి అనువాదించడం కామన్. గత కొంత కాలంగా ఎక్కువగా తమిళ సినిమాలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యేవి. వాటికి సక్సెస్ రేట్ ఎక్కువని బయ్యర్లు కూడా స్ట్రాంగ్ గా రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ ఏడాది టాలీవుడ్ మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన రంగస్థలం సినిమా పరభాషలోకి కూడా వెళ్లబోతోంది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని ఇతర బాషల సినీ ప్రముఖులు డబ్బింగ్ రైట్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

మొదట తమిళ్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలకు ఆసక్తి చూపినట్లు హీరో రామ్ చరణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కోలీవుడ్ లోనే కాకుండా మలయాళం - హిందీ అలాగే భోజ్ పూరి భాషల్లో కూడా రిలీజ్ కానుందట. సినిమాకు దక్కిన అదరణని దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇతర భాషల్లో అంత ఎక్కువగా క్రేజ్ లేదు.

కానీ సినిమా కంటెంట్ కి పరభాషా సినిమా ప్రేక్షకులు ఒక్కసారి కనెక్ట్ అయితే రామ్ చరణ్ కు రంగస్థలం క్రేజ్ ఇచ్చినట్టే. ఇప్పటికే తెలుగులో అత్యధిక షేర్స్ అందుకున్న మూడవ చిత్రంగా నిలిచింది. దాదాపు రంగస్థలం 103 కోట్ల షేర్లను అందించింది. ఇంకా ఆ కలెక్షన్స్ నెంబర్ పెరిగే అవకాశం ఉంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.    
Tags:    

Similar News