చూస్తాను.. కానీ చేయను : రాంచరణ్

Update: 2018-07-15 05:12 GMT
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా తన వ్యక్తిగత - సినిమా జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తన అభిరుచులు - ఎలాంటి సినిమాలు నచ్చుతాయి.. ఏఏ సినిమాలు తాను చేయలేనో అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోపిక్ ల హవా నడుస్తోంది. తెలుగులో మహానటి - హిందీలో సంజయ్ దత్ జీవితగాథ ‘సంజు’ ఎంత పెద్ద హిట్ట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగులో కూడా తాజాగా మరో రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ జీవితగాథను ఆయన కుమారుడు - బాలయ్య తీస్తుండగా.. పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను సుధీర్ బాబు హీరోగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ బయోపిక్ ల గురించి తన స్పందనను తెలియజేశాడు.

‘బయోపిక్ లలో నటించడం అంటే తనకు ఇష్టం లేదు. ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమా అది. దానికి పూర్తి న్యాయం చేస్తానో లేదో అనే సందేహం నాకు ఉంటుంది. ఓ వ్యక్తిలోని భావోద్వేగాలు - జీవితంలోని ఆటుపోట్లు తెరపైన చూడటమనేది ఓ చక్కటి అనుభూతి. బయోపిక్స్ చూడటానికి ఇష్టపడతా.. కానీ చేయడానికి కాదు’ అంటూ రాంచరణ్ తాను బయోపిక్ లో నటించనని చెప్పకనే చెప్పాడు.

ఇక తన భార్య ఉపాసన వల్ల తనకు హిందీ సినిమాలు చూసే అలవాటు వచ్చిందని రాంచరణ్ తెలిపారు. ‘ఉపాసన హిందీ సినిమాలను విపరీతంగా చూస్తుంది.. ఆమెతో దంగల్ - సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి సినిమా చూశానని’ తెలిపారు.  ఉపాసనకు కామెడీ చిత్రాలంటే ఇష్టమని.. ఆమె కారణంగా తాను కూడా హాస్య చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని చరణ్ పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన సంజు బయోపిక్ లో రణబీర్ అద్భుతంగా నటించాడని.. రణబీర్ నటన నాకు బాగా నచ్చిందని చరణ్ పేర్కొన్నాడు.
Tags:    

Similar News