సుక్కు హీరోయిన్ని చరణ్ రిజక్ట్ చేశాడా?

Update: 2015-12-06 11:30 GMT
కుమారి 21 ఎఫ్ ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులో హీరోయిన్ గా నటించిన హేబా పటేల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ‘కుమారి..’ వచ్చిన రెండు వారాలకే రెండు అవకాశాలు పట్టేసింది హేబా. ఐతే చిన్న అవకాశాలు ఎన్ని వస్తే ఏం లాభం.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని ట్రై చేసి బాగా డిజప్పాయింట్ అయిపోయిందట హేబా. సుకుమార్ రికమండేషన్ తో రామ్ చరణ్ సరసన నటించేద్దామని ప్రయత్నించిన హేబాకు నిరాశ తప్పలేదని సమాచారం.

రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’ రీమేక్ కు తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి చాలామంది హీరోయిన్లను పరిశీలించారు. చివరికి శ్రుతి హాసన్ ను ఖాయం చేశారు. ఐతే శ్రుతిని ఓకే చేయడానికి ముందు హేబా పటేల్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం ట్రై చేసిందట. అప్పటికి ‘కుమారి 21 ఎఫ్’ విడుదల కాలేదట. ఈ అమ్మాయి బాగుంటుందంటూ సుక్కు రికమండ్ చేయడంతో హేబా వెళ్లి సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ లను కలిసిందట. ఐతే ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేశాక చరణ్ పక్కన సూట్ కాదని తేల్చేసి సారీ చెప్పారట. నిజంగా చరణ్ పక్కన సూట్ కాదనుకున్నారో.. లేక హేబా లాంటి చిన్న హీరోయిన్ని చరణ్ పక్కన నటింపజేస్తే సినిమాకు క్రేజ్ రాదనుకున్నారో కానీ.. సుక్కు రికమండేషన్ తో స్టార్ స్టేటస్ సంపాదించేద్దామని చూసిన హేబాకు నిరాశ తప్పలేదు.
Tags:    

Similar News