రామ్ చరణ్.. తను రెమ్యూనరేషన్ తీసుకునే స్టైల్ మార్చేశాడు. సాధారణంగా ఒకో సినిమాకు కనీసం పది కోట్లు పుచ్చుకునే ఈ మెగా వారసుడు.. ఇప్పుడు చేయబోతున్న తని ఒరువన్ కోసం రూపాయి కూడా తీసుకోకుండానే సినిమా చేసేస్తున్నాడట. అఫ్ కోర్స్.. అందులో సినిమా రిజల్ట్ ను బట్టి పారితోషికం ఇవ్వాలనే డీల్ ఉంది.
సహజంగా చెర్రీకి పది కోట్లు ఇచ్చిన తర్వాత, మొత్తం సినిమాకి 40నుంచి 45 కోట్లవరకూ ఖర్చవుతూ ఉంటుంది. దీన్ని దాదాపు 50 రేంజ్ లో డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించడం జరుగుతోంది. దీంతో నిర్మాతకు కనీసం 5 కోట్ల మొత్తం లాభం ఉంటుంది. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయినా.. చరణ్ సినిమాలు కనీసం 40 కోట్లు వసూలు చేసేస్తాయి. ఎంత బీభత్సమైన ఫ్లాప్ టాక్ వచ్చినా, 40 కోట్ల షేర్ వసూళ్లను సాధించగలగడం చెర్రీ స్టామినా. అంటే కొన్నవారికి 15శాతం మించి నష్టాలు వచ్చే ఛాన్స్ లేదు. అయితే, ఈ సారి ఆ నష్టం కూడా ఉండకుండా.. కొత్తగా డీల్ సెట్ చేశాడు రామ్ చరణ్.
తను ఏ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేసి, 30 కోట్ల ఖర్చుతో కంప్లీట్ చేసేలా తని ఒరువన్ రీమేక్ ప్లాన్ చేశారు. అదే ధరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాక, లాభాలు షేర్ చేసుకోవాలన్నది డీల్. ఈ లెక్క ప్రకారం సినిమా ఫ్లాప్ అయితే.. చరణ్ కి 5-6 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ వస్తుంది. ఒక వేళ హిట్ అయ్యి 50 కోట్లు రాబడితే మాత్రం.. కనీసం 15 కోట్లు చరణ్ ఖాతాలోకి వెళ్తాయి. హిట్, ఫ్లాప్ పై బేస్ అయ్యి చరణ్ కి పారితోషికం వస్తుందన్న మాట. అంటే నష్టం వస్తే దాదాపు సగం హీరో భరించేలా చేసుకున్న ఈ డీల్ అందరు నిర్మాతలను ఆకర్షిస్తోంది.