మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఖ్యాతికి కెక్కబోతున్నారు. `ఆర్ ఆర్ ఆర్` ప్రకటనతోనే చరణ్ ఇమేజ్ రెట్టింపు అయింది. ఇక రిలీజ్ తర్వాత అతని బ్రాండ్ వ్యాల్యూ ఆకాశన్నంటడం ఖాయం. ఇప్పటికే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న చరణ్ తాజాతా మరో బ్రాండ్ ని ఖాతాలో వేసుకున్నారు. `ప్రూటీ` బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రూటీ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రం `పుష్ప` సక్సెస్ తో అతని ఇమేజ్ రెట్టింపు కావడంతో రాపిడో..జోమాటో లాంటి సంస్థల్ని ప్రమోట్ చేసే బాధ్యతలు తీసుకున్నారు.
అయితే చరణ్ ఎంట్రీతో ప్రూటీ యాడ్ ని బన్నీ వదులకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ బన్నీ సౌత్కి ప్రూటీ అంబాసిడర్ గా వ్యవహరించారు. అయితే `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో చరణ్-అలియా భట్ జంట క్రేజ్ని ఎన్ క్యాష్ చేసుకునే ప్రక్రియలో భాగంగా సదరు సంస్థ చరణ్ తో పాటు అలియాని ఎంపిక చేసి తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవాలని నిర్ణయించింది.
వేసవి నుంచి చరణ్- అలియా భట్ ల ముఖ చిత్రం ప్రూటీ బాటిల్స్ పై కనిపించనుంది. ఇప్పటికే ప్రూటీ షూట్ యెక్క ప్రింట్ వెర్షన్ చిత్రాలు నెట్టింట వైరల్ గా మారాయి. దానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన మరికొన్నిరోజుల్లో రిలీజ్ కానుంది. నెల రోజుల క్రితం చరణ్ ముంబైలోకనిపించిన నేపథ్యంలో పలు మీడియా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాడ్ షూట్ లో భాగంగానే చరణ్ ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.
అలాగే చరణ్ ఇంకా మరికొన్ని సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఆ బ్రాండ్ టై అప్ ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. ఇప్పటికే చరణ్ చేతిలో పలు బ్రాండ్ కంపెనీలు ఉన్నాయి. గతేడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు వెర్షన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిబడిన సంగతి తెలిసిందే. రెండు ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్‌లో చేసేందుకు రామ్ చరణ్ రూ. 3 కోట్లు ఛార్జ్ చేసారు. ఇక ఉత్తరాదిలో వరుణ్ ధావన్ ప్రూటీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నాడు.
ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 15వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత `జెర్సీ` దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నారు. ఇది పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కంటెంట్ అని సమాచారం. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత చరణ్ ప్లానింగ్ లో చాలా మార్పులు గమనించ వచ్చు.