ఇప్పుడు ''ధృవ'' సినిమా టైటిల్ సాంగ్ వీడియోను కాని.. ఆ సాంగ్ మేకింగ్ వీడియోను కాని చూసినవారందరూ కూడా.. అసలు రామ్ చరణ్ ఇలా సిక్స్ ప్యాక్ ఎలా చేశాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అందుకోసం మనోడు ముంబయ్ నుండి ప్రత్యేకంగా రాకేష్ ఉడియార్ అనే ఒక ట్రైనర్ ను రంగంలోకి దించాడు. అతగాడు అతి తక్కువ సమయంలో చరణ్ తో ఇలా బల్కీ బాడీ తయారుచేయించేశాడు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉందండోయ్.
నిజానికి చరణ్ ఈ సినిమా కోసం బాడీ బిల్డ్ చేసే సమయానికి.. ఈ రాకేష్ ఉడియార్ బాలీవుడ్ లో ఒక ప్రక్కన సల్మాన్ ఖాన్ కు సుల్తాన్ సినిమా తరువాత ట్యూబ్ లైట్ సినిమా కోసం బాడీ తయారు చేయించే పనిలో ఉన్నాడు. అదే సమయంలో అమీర్ ఖాన్ దంగల్ సినిమా కోసం కూడా ఇతడి సంరక్షణలోనే బాడీని పెంచడం తగ్గించడం చేస్తున్నాడు. ఆ హీరోలిద్దరి బాడీ మేకింగ్ వీడియోస్ లో రాకేష్ కనిపిస్తాడు కూడా. అయితే చరణ్ ను బాడీ చేయాల్సిందిగా సల్మాన్ సజెస్ట్ చేశాడు. అలాగే సల్మాన్ తో పాటు అమీర్ కూడా మనోడికి పర్మిషన్ ఇవ్వడంతో.. హైదరాబద్ వచ్చి చరణ్ ను ట్రైన్ చేశాను అంటున్నాడు ఈ ఫిట్నెస్ ఎక్స్ పర్ట్.
ముఖ్యంగా టైటిల్ సాంగులో ఫిట్నెస్ కోసం.. అలాగే 6 ప్యాక్ లుక్ కోసం ఈ ట్రైనర్ ను దింపినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా టాలీవుడ్ లో ఇలా సూపర్ స్టార్లు అందరూ మెగా సిక్స్ ప్యాకులతో అదరగొట్టేస్తే చూడ్డానికి బాగుందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/