మాకేం ప్రాబ్లం లేదు..బాబాయ్‌ కి ఉండాలి-చెర్రీ

Update: 2015-10-12 15:47 GMT
ఇంతకీ చిట్టి చెల్లెలు కొణిదల నిహారిక ఇప్పుడు హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తోంది కదా.. ఈ విషయం గురించి ఫ్యామిలీలోని మెగా హీరోలు ఏమనుకుంటున్నారు? వారి అంతరాయం ఏంటి? ఈ విషయంపై ఇంతవరకు ఎవ్వరూ నోరు విప్పలేదు. ఓ టివి ఇంటర్యూలో మాట్టాడుతూ నిహారిక ఏం చెప్పిందంటే.. డాడ్‌ చిరంజీవికి తన కోరికను చెప్పగానే వెంటనే ఎస్‌ అన్నారని... ఆల్సో అన్నయ్య చరణ్‌ - వరుణ్‌ కూడా ఓకె అన్నారని కూడా చెప్పింది. ఇంతకీ ఈ మ్యాటర్‌ పై చరణ్‌ ఏమనుకుంటున్నాడు?

''నిహారిక సినిమాల్లోకి వస్తున్నట్లు నాకు తెలియదు. నేను కూడా పేపర్‌ లోనే చదివాను'' అంటూ సెలవిచ్చాడు. మరి మీ ఫ్యామిలీ నుండి ఒక కమర్షియల్‌ హీరోయిన్‌ అంటే మీకు సమ్మతమేనా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ''ఒకవేళ తను హీరోయిన్‌ అయితే ఏమన్నా ఇబ్బంది అనేది మా నాగ బాబాయ్‌ కు ఉండాలి కాని.. మాకేం ప్రాబ్లం లేదు. తండ్రిగా ఆయనకు ఓకె అనుకున్నప్పుడు మాకూ ఓకె'' అంటూ చెప్పేశాడు. అంతేకదండీ మరి.. నాగబాబు కు ఓకె అయినప్పుడు నిహారికను హీరోయిన్‌ కాకుండా ఆపేదెవరులే. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఆమె లాంచింగ్ కు అక్టోబర్‌ 30న ఒక పెద్ద ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు అని తెలుస్తున్న తరుణంలో.. అసలు తను హీరోయిన్‌ అవుతున్నట్లు తనకు తెలియదని చరణ్‌ చెప్పడం సంచలనమే.

ఏదేమైనా.. 'ఒక మనసు' అనే సినిమా ద్వారా నాగ శౌర్య సరసన నిహారిక హీరోయిన్ గా దర్శనమివ్వనుంది. ఈ సినిమా అక్టోబర్‌ 30న లాంచ్‌ చేయనున్నారు. కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరవుతారని ఆల్రెడీ తెలిసిన న్యసే. వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    

Similar News