మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కూడా నటించనున్న సంగతి తెలిసిందే. 'మగధీర' 'బ్రూస్ లీ' చిత్రాలలో ఇద్దరూ కొన్ని నిమిషాలపాటు కనిపించి ఫ్యాన్స్ ని అలరించిన చిరు - చిరుత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఖుషీ అవుతున్నారు. అయితే ఇనిషియల్ స్టేజీలో చరణ్ కోసం గెస్ట్ రోల్ క్రియేట్ చేసిన కొరటాల.. తరవాత దీనిని ఫుల్ లెన్త్ రోల్ గా మార్చినట్లు తెలుస్తోంది. ముందుగా 30 నిమిషాల నివిడి అనుకున్నప్పటికి.. ఇప్పుడు సుమారు 1 గంట ఉండేలా చేంజెస్ చేసారట. ఇటీవల కొరటాల శివ ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ రోల్ పై క్లారిటీ ఇచ్చాడు.
'ఆచార్య' లో చరణ్ ఫుల్ లెంత్ రోల్ లో కనిపిస్తాడని.. అది కూడా ఓ పవర్ ఫుల్ క్యారక్టర్ అని.. చిరంజీవి - చరణ్ లను కలిపి డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని.. వారిని ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నానని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఇద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాలు గూస్బమ్స్ కలిగించేలా ఉండబోతున్నాయట. చరణ్ - చిరంజీవిలతో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కరోనా నుంచి కోలుకున్న చరణ్.. త్వరలోనే 'ఆచార్య' సెట్స్ లో అడుగుపెడతాడని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.