నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి... : చరణ్‌

Update: 2019-03-06 10:30 GMT
మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అందరితో కలివిడిగా ఉంటూ, తోటి హీరోలతో చాలా స్నేహంగా ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సమ ఉజ్జీలు అయిన మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలతో చాలా స్నేహంగా ఉంటూ, ఏమాత్రం జలసీ ఫీల్‌ లేకుండా చరణ్‌ వారితో కలిసి పోతూ ఉంటాడు. వారికి కూడా ఎలాంటి ఫీల్‌ లేకుండా చరణ్‌ తో కలిసి పోతారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, చరణ్‌ లు కలిసి సినిమా చేస్తున్న విషయం కూడా తెల్సిందే. ఇక చరణ్‌ కు ఇండస్ట్రీలో మరో ఆప్త మిత్రుడు శర్వానంద్‌. హీరో కాకముందు నుండి కూడా చరణ్‌, శర్వాలు క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్‌ చేసేవారు.

తాజాగా రామ్‌ చరణ్‌ మరోసారి తనకు శర్వాపై ఉన్న అభిమానంను చాటుకున్నాడు. నేడు శర్వానంద్‌ పుట్టిన రోజు సందర్బంగా చరణ్‌ తన ఫేస్‌ బుక్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, దేవుడు నిన్ను ఆశీర్వదించి సక్సెస్‌ మరియు సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు. చరణ్‌ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అంటూ శర్వా స్థాయిని మరోసారి అమాంతం పెంచేశాడు. స్టార్‌ అయినా తర్వాత కూడా చిన్నప్పటి మిత్రుడిని ఇంకా ఈస్థాయిలో అభిమానించడం చరణ్‌ ఉన్నత స్థాయిని కూడా చెప్పకనే చెబుతుంది. మా తరపున కూడా మెగా మిత్రుడు శర్వానంద్‌ కు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Tags:    

Similar News