RC12 చివరి రోజు షూట్‌

Update: 2018-11-04 05:00 GMT
గత సమ్మర్‌ లో ‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ను దక్కించుకుని ఇండస్ట్రీ టాప్‌ చిత్రాల జాబితాలో చేరిన రామ్‌ చరణ్‌ తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. చరణ్‌ కు 12వ చిత్రం అయిన ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రావడం కన్ఫర్మ్‌ అయ్యింది. తాజాగా చిత్రంలోని తన పార్ట్‌ షూటింగ్‌ పూర్తి అయినట్లుగా విలన్‌ రోల్‌ లో కనిపించబోతున్న వివేక్‌ ఒబేరాయ్‌ కూడా పేర్కొన్నాడు.

తాజాగా చరణ్‌ తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వివేక్‌.. చరణ్‌ తో లాస్‌ రోజు షూట్‌ అంటూ పోస్ట్‌ చేశాడు. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోగా వెలుగు వెలిగిన వివేక్‌ ఒబేరాయ్‌ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్‌ స్టార్స్‌ తెలుగులో విలన్‌ పాత్రలను పోషించడం కామన్‌, కాని బాలీవుడ్‌ స్టార్‌ హీరో చరణ్‌ మూవీలో నటిస్తున్న కారణంగా అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంపై బాలీవుడ్‌ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. హిందీ డబ్బింగ్‌ శాటిలైట్‌ రైట్స్‌ భారీ ఎత్తున పలికే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌ ను ఇంకా ప్రకటించలేదు. దీపావళి సందర్బంగా ఈ చిత్రం టైటిల్‌ ను ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. టాకీ పార్ట్‌ పూర్తి అయ్యిందని - మిగిలి ఉన్న పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యు ఇటీవలే పేర్కొన్నారు. చరణ్‌ రంగస్థలం చిత్రంకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం వసూళ్లను సాధిస్తుందని మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News