ఆ మధ్య మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు హీరోయిన్ పూజా హెగ్డే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేసినట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత పూజా హెగ్డే అందుబాటులోకి వచ్చిన తర్వాత మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ యొక్క సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయిన విషయం తెల్సిందే.
హీరోయిన్స్ రెండు మూడు సినిమాలు ఒకేసారి చేస్తూ ఉండటం వల్ల డేట్ల విషయంలో అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్.. శంకర్ కాంబో సినిమాకు కూడా హీరోయిన్ వల్ల సమస్య తప్పలేదు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్.. శంకర్ సినిమా హీరోయిన్ కియారా అద్వానీ కారణంగా తాజా షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యిందట.
కియారా అద్వానీ గతంలో ఇచ్చిన డేట్స్ లో శంకర్ సన్నివేశాలు ముగించలేక పోయాడట. దాంతో ఇప్పుడు ఆమె కొత్తగా డేట్లు ఇచ్చేందుకు ఇబ్బందిగా ఉందట. ప్రస్తుతం హిందీలో ఆమె వరుసగా సినిమాలు చేస్తున్న కారణంగా రామ్ చరణ్ మరియు శంకర్ లు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటూ మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ మరియు శంకర్ కాంబోలో రూపొందుతున్న సినిమా యొక్క చిత్రీకరణ ఈ సమ్మర్ వరకు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను ఇదే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. కియారా అద్వానీ యొక్క డేట్లు ఈ నెల చివరి నుండి లేదా ఫిబ్రవరి నుండి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అప్పుడు షూటింగ్ షురూ అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.