టాలీవుడ్ యువ కథానాయకుల్లో అతిథ్యం గురించి మాట్లాడితే రామ్ చరణ్ - ప్రభాస్ ల నుంచే మొదలు పెట్టాల్సి వుంటుంది. వీళ్లిద్దరూ అంత మంచి హోస్ట్ లన్నమాట. రామ్ చరణ్ అయితే తన మనసుకు నచ్చినవాళ్లు ఇంటికొస్తున్నారని తెలిస్తే చాలు.. వాళ్లని అతిథి మర్యాదలతో ముంచెత్తేస్తాడు. రుచికరమైన వంటకాల్ని వండించి స్వయంగా వడ్డిస్తుంటాడు. సల్మాన్ ఖాన్ విషయంలోనే తీసుకోండి. సల్మాన్ అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టం. భాయ్ భాయ్... అని ఆప్యాయంగా పిలుస్తుంటాడు. ఆయన ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా రామ్ చరణ్ ఇంట్లో చేతులు కడగాల్సిందే. ఒకవేళ సల్మాన్ షూటింగ్ కోసం వచ్చినా సరే... సెట్ కి తన ఇంటి నుంచి భోజనం పంపించేస్తాడు రామ్ చరణ్. సల్మాన్ కూడా సేమ్ టు సేమ్. చరణ్ ముంబైకి ఎప్పుడు వెళ్లినా సల్మాన్ ఖాన్ ఇంటి వంటలు టేస్ట్ చేయాల్సిందే. వారిద్దరి మధ్య అంత క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది. అందుకే తన తండ్రి పుట్టిన రోజుకి రావాలని చరణ్ ఆహ్వానం పంపగానే సల్మాన్ స్పెషల్ ఛార్టెడ్ ఫ్లైట్ వేసుకొని మరీ హైదరాబాద్ లో వాలిపోయాడు.
ప్రభాస్ హోస్టింగ్ కూడా అంతే. ఆయన హైదరాబాద్ లో ఎక్కడ షూటింగ్ లో పాల్గొంటున్నా భోజనం ఇంటి నుంచే వెళుతుంది. ఆ భోజనం కూడా ఐదుగురికి సరిపడేలా ఉంటుందట. తన చుట్టూ ఉన్నవాళ్లకి కొసరి కొసరి వడ్డిస్తుంటాడట. ఆ విషయాల్ని రాజమౌళి - సూర్యలు భలే చెబుతుంటారు. ఇలా మన యంగ్ హీరోలకి అతిథి మర్యాదలు చాలా బాగా తెలుసన్నమాట. తాజాగా రామ్ చరణ్ మర్యాదలకి, ఆయన పెట్టిన భోజనానికి మరో బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్ ఫ్లాట్ అయిపోయాడు. వరుణ్ ధావన్ `దిల్ వాలే` సినిమా షూటింగ్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో గడుపుతున్నాడు. అక్కడే రామ్ చరణ్ `బ్రూస్ లీ` షూటింగ్ కూడా జరుగుతోంది. ఇటీవల చరణ్ ని మాట్లాడించేందుకని వరుణ్ సెట్ కి వెళ్లాడట. ఇక తన సెట్ లోకి వరుణ్ వెళితే ఊరికే వదులుతాడా? ఇంటి నుంచి బిర్యానీ తెప్పించి వడ్డించాడట. అది టేస్ట్ చేసిన వరుణ్ ధావన్ `వావ్ సూపర్బ్... చరణ్ ఇంటి భోజనం అదిరిపోయింది` అంటూ తన సన్నిహితులకి చెబుతున్నాడట. అదన్నమాట సంగతి.