చిట్టిబాబూ ఈ జోష్ సరిపోదు

Update: 2018-03-25 06:20 GMT
రంగస్థలం విడుదలకు వంద గంటల కంటే తక్కువ సమయమే ఉంది. మెగా ఫాన్స్ దీని మీద గంపెడాశలతో ఉన్నారు. ధృవ వచ్చి ఏడాది దాటేసి మూడు నెలలు కూడా పూర్తి చేసుకుంది. ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు  మామూలుగా లేవు. కాని మొన్నటి వరకు నానా హంగామా చేసిన యూనిట్ ఉన్నట్టుండి సైలెంట్ అవ్వడం చూస్తుంటే  అనుమానాలు రాకమానవు. సుకుమార్ ఒకపక్క రామ్ చరణ్ మరోపక్క మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా గడపటం తప్ప ఇంకే హడావిడి కనిపించడం లేదు. ఒక ఛానల్ కు తో చరణ్ మాట్లాడుతూ  రిజల్ట్  పట్ల  తనకు టెన్షన్ గా ఉందని - కెరీర్ లో ఇప్పటి దాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఇదొక్కటి మరొక ఎత్తు అన్ని చెబుతూ  వచ్చాడు. అసలు హీరోనే టెన్షన్ పడితే ఎలా అనే డౌట్ సహజంగానే వస్తుంది. లెంగ్త్ విషయంలో కాంప్రోమైజ్ కాకుండా 2 గంటల 45  నిమిషాల దాకా ఉంచేయడం - దశాబ్దాల  వెనుక పల్లెటూరి నేపధ్యాన్ని తీసుకోవడం మెట్రో ఆడియన్స్  ని ఎంతవరకు మెప్పిస్తాయి అనే దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది.

ప్రాక్టికల్ గా చూసుకుంటే సుకుమార్ ఇంతవరకు మాస్ ని యునానిమస్ గా మెప్పించిన సినిమా చేయలేదు. ఆర్య - నాన్నకు ప్రేమతో - 100% లవ్ ఈ మూడూ  యూత్ ని మెప్పించినవే కాని మాస్ ఓకే చేసినవి కావు.  జగడం - ఆర్య 2 - 1 నేనొక్కడినే  ఫలితాలు చేదుగా వచ్చాయి. ఈ నేపధ్యంలో సుకుమార్ ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టొరీని ఎలా డీల్ చేసి ఉంటాడా అనే సందేహాలు వ్యక్తమవడం కొట్టి పారేయలేం. ఈ బ్యాక్ డ్రాప్ లో పవన్ కాటమ  రాయుడు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ అవుట్ కాలేదు. సో రంగస్థలంపై ఈ రకంగా ఒత్తిడి ఉండటం సహజం. పైగా చరణ్ కొత్తగా కనిపించడం డిఫరెంట్ ఫీల్ ఇస్తున్నా కంటెంట్ చాలా ఎక్స్ ట్రాడినరిగా ఉంటేనే ఇది వర్క్ అవుట్ అవుతుంది.

ఓపెనింగ్స్ విషయంలో ఎటువంటి అనుమానాలు లేకపోయినా పెట్టిన పెట్టుబడికి రంగస్థలంకు లాంగ్ రన్ చాలా అవసరం. దాని తర్వాత వరసగా ప్రతి శుక్రవారానికి ఒక క్రేజీ సినిమా లైన్ లో ఉంది. చల్ మోహనరంగా - కృష్ణార్జున యుద్ధం - భరత్ అనే నేను - కాలా - నా పేరు సూర్య ఇలా లూప్ లైన్ ఎక్కడా ఆగే పరిస్థితి లేదు. సో చిట్టిబాబు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులపాలి అంటే ఈ జోష్ సరిపోదంటున్నారు ఫాన్స్. మరి ఈ నాలుగు రోజులను చిట్టిబాబు మేనియా  ఎలా కమ్ముతుందో చూడాలి
Tags:    

Similar News