కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్లనివ్వు.. కుందనాల కూనమ్మ పిల్లనివ్వు .. ఊరూ వాడా వెల్లువాయె .. అంటూ సాగిన బొంబాయి సినిమాలో పాటను అంత తేలిగ్గా మర్చిపోగలమా? ఆ పాటలో అరవిందస్వామి ఆహార్యాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. మనీషాకొయిరాలా - అరవింద్ స్వామి జంట ఆ చిత్రంలో మెస్మరైజ్ చేశారు. మతఘర్షణలో ప్రేమను చూపించాడు మణిరత్నం. ఆ ఒక్క సినిమాతో అరవింద్ స్వామి పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. కట్ చేస్తే అరవింద్ స్వామి కొన్ని సినిమాల్లో నటించి మాయమయ్యాడు.
కానీ ఇటీవలి కాలంలో రీఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. మరోసారి మణిరత్నం దర్శకత్వంలోనే నటించాడు. కడలి చిత్రంతో ఆకట్టుకున్నాడు. మళ్లీ ఇప్పుడు జయం రవి సినిమా తనిఒరువన్ లో విలన్ పాత్రలో మైమరిపించాడు. సాఫ్్టగా కనిపిస్తూనే పీకలు కోసేవాడిలా కనిపించాడు. ఇందులో మెడిసిన్ మాఫియాని నడిపించే దొరబాబులా కనిపించి అదరగొట్టేశాడు. సూటు బూటు వేసుకున్న దొరబాబులా కనిపిస్తూనే దుర్మార్గాలెన్నో చేస్తుంటాడు. జయం రవిని మించి అరవింద్ స్వామికి పేరొచ్చింది. అంత గొప్ప నటప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
అందుకే ఇప్పుడు తనిఒరువన్ తెలుగు రీమేక్ తీస్తే అందులోనూ అరవింద్ స్వామినే విలన్ గా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మోహన్ రాజా చరణ్ తో ముచ్చట్లు పెట్టాడు. చరణ్ వైపు నుంచి కూడా పాజిటివ్ స్పందన వచ్చింది. తనిఒరువన్ రీమేక్ లో నటించేందుకు ఆసక్తి కనబరిచాడని వార్తలొచ్చాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే చెర్రీ అరవింద్ స్వామితో పోటీపడాల్సి ఉంటుంది. అరవింద్ మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్స్ తో పోటీపడి హీరోగా మెప్పించాల్సి ఉంటుంది. అతడి ఛార్మ్ తో ఓవైపు, పెర్ఫామెన్స్ తో మరోవైపు పోటీపడాల్సి ఉంటుంది. అది సంగతి.