బతుకమ్మ చేసుకున్న చెర్రీ వైఫ్

Update: 2016-10-10 14:20 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.. తన సంతోషాన్ని సెలబ్రేషన్స్ ని భర్త అభిమానులకు సోషల్ మీడియా జనాలకు పంచుతూ ఉంటుంది. రీసెంట్ గా బతుకమ్మ సంబురం చేసుకున్న ఉపాసన.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి.. తమ వేడుకను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

ప్రతీ ఏటా తమ కుటుంబం బతుకమ్మ సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పిన చెర్రీ వైఫ్.. తన గ్రాండ్ మదర్ నిర్వహిస్తున్న 'బాలిక నిలయం' కు చెందిన అమ్మాయిలు.. తనకు బతుకమ్మలు తయారు చేయడంలో సాయం చేసినట్లు వివరించింది. ఈ పండుగ వేడుకలు ఆ సంతోషం.. అమ్మాయిలకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలు అని చెప్పిన ఉపాసన.. తాను కూడా ఈ అమ్మాయిలందరితో కలిసి వారి మాదిరిగానే పెరిగానని అంటోంది.

తాను తెలంగాణ అమ్మాయినే అన్న రామ్ చరణ్ భార్య.. దుర్గా నవరాత్రు సందర్భంగా తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పూల ఉత్సవాన్ని.. బాలిక నిలయంకు చెందిన వారితో కలిపి జరుపుకోవడం  బోలెడు సంతోషం ఇస్తుందని అంటోంది.
Tags:    

Similar News