టివి యాడ్‌ లో ఉపాసన!!

Update: 2016-05-15 06:24 GMT
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ను పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఉపాసన కామినేని కూడా అప్పటినుండి సెలబ్రిటీయే. అప్పటివరకు కేవలం టాప్‌ క్లాస్‌ సర్కిల్స్‌ లోనే పాపులర్‌ అయిన ఉపాసన.. ఆ తరువాత టోటల్‌ తెలుగు రాష్టాలలో  ఆమె మెగా వారి కోడలుగా ప్రతీ ఇంట్లోనూ పాపులర్‌ అయిపోయింది. ఇప్పుడు టివిలో కూడా వస్తోంది.

మెగా కోడలు కాకముందే ఉపాసన అపోలో లైఫ్‌ విభాగానికి డైరక్టర్‌. అలాగే బి-పాజిటివ్‌ అనే మ్యాగజైన్‌ కు ఎడిటర్‌. అపోలో లైఫ్‌ వారు తయారు చేసే రకరకాల ప్రొడక్టులకు ఇప్పుడు టివిలో యాడ్‌ వస్తోంది. అయితే ఈ యాడ్‌ వీడియోలో ఉపాసన కనిపించడంలేదు కాని.. యాడ్‌ అయిపోయాక.. ఆమె ఫోటో వేసి.. ఈ ప్రాడక్టులు వాడండి అంటూ ఓ నాలుగు లైన్లు చెప్పి.. కింద ఉపాసన అనే సంతకం వేస్తున్నారు. ఆ విధంగా ఉపాసన ఇప్పుడు టివి యాడ్‌ లో కనిపిస్తోంది.

మొత్తానికి మెగా వారి కోడలు కూడా అలా టివి లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మీదట మరికొన్ని అపోలో యాడ్స్‌ లో కూడా ఉపాసన అండ్‌ రామ్ చరణ్‌ కలసి నటించే ఛాన్సుందని తెలుస్తోంది.

Tags:    

Similar News