సమంతే కాదు.. చరణ్‌ కూడా అంతే

Update: 2017-08-11 03:57 GMT
అంటే సినిమాల్లో మీకు కావల్సిన వారికి మాత్రమే ఆల్ ది బెస్టులు చెప్పుకుంటారా? ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది. చాలామంది సినిమా సెలబ్రిటీలు.. అరే మనం కామన్ ఇండస్ర్టీలో ఉన్నాం అని కాకుండా.. కేవలం మనవాళ్ళ వరకే విషెస్ అంటూ తమని తాము కొందరివారిగా పరిమితం చేసుకుంటారు. విచిత్రం ఏంటంటే.. రంగస్థలం 1985లో నటిస్తున్న ఈ జంట ఇద్దరూ అదే పనిచేశారు. వారి భావం మనం అర్ధంచేసుకోవచ్చు కాని.. ఇండస్ర్టీ సంక్లిష్టతను వారు కూడా అర్దం చేసుకోవాలి.

మొన్ననే ఒక ట్వీటేసింది సమంత. ''నా సూపర్ స్టార్ బ్రదర్'' కు అల్ ది బెస్ట్.. నేనే రాజు నేనే మంత్రి సినిమా మొదటి ఆటను చూస్తున్నాను అంటూ ట్వీటేసంది. మరి అదే రోజున తన గత బ్లాక్ బస్టర్ హీరో నితిన్ ''లై''.. అలాగే అతని తొలి సినిమాలో హీరోయిన్ గా చేసిందిగా.. బెల్లంకొండ శ్రీనివాస్ ''జయ జానకి నాయక'' సినిమాలు కూడా వస్తున్నాయి. వాటి గురించి మాటైనా లేదు. మరి నాగచైతన్యను పెళ్ళి చేసుకుంటుంది కాబట్టి.. ఇప్పుడు రానా తనకు అన్నయ్య అవుతాడు కాబట్టి.. సురేష్‌ బాబు బాబాయ్ అవుతారు కాబట్టి.. వారికి విషెస్ ను గట్టిగానే చెప్పింది.

అలాగే ఈ బ్యాచ్ లో ఇప్పుడు రానా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్ కూడా చేరాడు. తన బెస్ట్ ఫ్రెండ్ రానాకు.. అలాగే సురేష్‌ అంకుల్ కి.. కాజల్ అండ్ నవదీప్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తేజ గారి గురించి కూడా మెన్షన్ చేశాడు. మొత్తానికి నేనే రాజు నేనే మంత్రి సినిమాకు విషెస్ చెప్పి.. రేసులో ఉన్న ఇంకో రెండు సినిమాల గురించి ఒక్క మాటైనా చెప్పలేదు. చెప్పకపోవడం తప్పు కాదు కాని.. చెప్పడం అనేది బాధ్యత. ఇంత పెద్ద రేంజ్ స్టార్స్ అలా కొందరి కోసమే చెబిత ఎలా అనేదే ప్రశ్న.
Tags:    

Similar News