మెగా కాంపౌండ్ లో ఊహించని పోటీతత్వం బయటపడుతోందా? అంటే అవుననే సమాచారం. ఈ కాంపౌండ్ లో ఇప్పటికే లెవన్ ప్లేయర్స్ (11మంది హీరోలు) గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అందులో ప్రధానమైన పోటీ రామ్ చరణ్ .. అల్లు అర్జున్ ల మధ్యనే. ఆ ఇద్దరూ తమని తాము పాన్ ఇండియా స్టార్లు గా మలుచుకునేందుకు నిరంతరం ఇతర ప్రపంచంతో పోటీపడుతున్నారు. అలాగే తమలో తామే దీనిని ఆరోగ్యకర పోటీగా భావిస్తున్నారు.
రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ కాంపిటీషన్ ఇటీవల మరింతగా ఓపెనవుతోంది. ఆ ఇద్దరూ తమవైన ప్రణాళికలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చరణ్ ఇటీవల సైలెంటుగా తన ప్లాన్ ఛేంజ్ చేసి ఇరుగు పొరుగు భాషల మార్కెట్ పైనా దృష్టి సారించారు. ఆ క్రమంలోనే అతడి దర్శకుల ఎంపిక ఛాయిస్ కూడా మారిపోయింది. రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ తర్వాతా తన గ్రాఫ్ తగ్గకుండా చెర్రీ ప్లాన్ చేశారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అటెన్షన్ తనవైపు ఉండేలా రోబో శంకర్ నే బరిలో దించేస్తున్నాడు. చరణ్ - శంకర్ సినిమా ఈపాటికే ప్రారంభం కావాల్సి ఉండగా శంకర్ కి ఉన్న ఇతర సమస్యలతో అది సెట్స్ కెళ్లలేదు. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత రోబో శంకర్ తో సినిమా చేయాలన్నది వ్యూహాత్మకం. అలాగే చరణ్ తన డాడ్ చిరంజీవితో కలిసి ఆచార్య చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు చరణ్ కి పోటీగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రణాళికల్లోనూ వేగం కనిపిస్తోంది. సుకుమార్ తో పుష్ప డ్యూయాలజీని జాతీయ స్థాయి మార్కెట్ ని దృష్టిలో ఉంచుకునే చేస్తున్నాడు. రంగస్థలం దర్శకుడిగా సుక్కూకి ఏర్పడిన కొత్త ఇమేజ్ పాన్ ఇండియా రేంజుకు సరితూగుతోంది. అలాగే పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో బంపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ తోనూ బన్ని తదుపరి ఐకన్ చిత్రాన్ని చేయనున్నారు. ఇవి రెండూ పూర్తయ్యాక కూడా బన్ని మరో పాన్ ఇండియా కేటగిరీ చిత్రానికే సన్నాహాలు చేస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకులు ఎఆర్ మురుగదాస్ తో పని చేయాలని భావిస్తున్నారు. అతడితో ప్రాజెక్ట్ ని ఖాయం చేసేందుకు విస్త్రతంగా కథా చర్చలు సాగిస్తున్నారని తెలిసింది. ఇంతకుముందే మురుగదాస్ బన్నీని కలిసి లైన్ వినిపించారు. తాజాగా మరోసారి ఎఆర్ మురుగదాస్ మరోసారి బన్నీని సంప్రదించారట.
ఇటీవల జూమ్ సమావేశం ద్వారా బన్నీకి స్క్రిప్ట్ ను వివరించారని తెలిసింది. అల్లు అరవింద్ - అర్జున్ డ్యూయో ఇంకా స్క్రిప్ట్ ను ఫైనల్ చేయలేదు. వారు ఓకే చెబితే ఈ పాన్-ఇండియన్ సినిమాని అగ్ర తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తారని టాక్ వినిపిస్తోంది. చరణ్ జాతీయ స్థాయి దర్శకుడినే ఎంచుకోగా.. ఇప్పుడు బన్ని కూడా పోటాపోటీగా అదే స్థాయి ట్యాలెంటెడ్ దర్శకుడిని ఎంపిక చేసుకోవాలనుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
అల్లు అర్జున్ 5 జూలై నుండి పుష్ప షూటింగును తిరిగి ప్రారంభించనున్నారు. సుకుమార్ తో పుష్ప -1 చిత్రీకరణ పూర్తవ్వగానే.. తదుపరి వేణు శ్రీరామ్ దర్శకత్వంలోని ఐకన్ చిత్రీకరణకు వెళతారు. అటుపై తిరిగి పుష్ప 2 సెట్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. స్క్రిప్టు ఫైనల్ అయిపోతే మురుగదాస్ ప్రాజెక్ట్ సెట్స్ కెళ్లే వీలుంటుంది. అలాగే విక్రమ్ కె కుమార్... మారుతి వంటి వారితోనూ బన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఉంది.